పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ తీరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ‘ఖర్గ్’ (Kharg Island) ఉంటుంది. 20 చదరపు కిలోమీటర్ల అతి తక్కువ వైశాల్యంతో ఉన్నప్పటికీ.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముకగా చెప్తారు. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం వాటా దీనిదే. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, 2024లో ఈ ద్వీపం నుంచి చమురు ఎగుమతుల ద్వారా ఇరాన్ 78 బిలియన్ డాలర్లను ఆర్జించింది. దీన్ని బట్టి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నడవాలంటే ఇక్కడి చమురు ఎగుమతులే కీలకమన్న విషయం అర్థమవుతున్నది. ఖర్గ్‌లోని లోడింగ్ టర్మినళ్లు రోజుకు ఏడు మిలియన్ బ్యారెళ్ల చమురును హ్యాండిల్ చేయగలవని నివేదికలు చెప్తున్నాయి.
Read Also: Induction cooker : గ్యాస్ ధరల షాక్, ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్
యుద్ధానికి అవసరమైన నిధుల కోసమే
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలుకావడానికి ముందు ఖర్గ్ నుంచి రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిన ఇరాన్.. ఘర్షణలు మొదలైన తర్వాత ఈ ఎగుమతులను 4 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది. యుద్ధానికి అవసరమైన నిధుల కోసమే ఇలా చేసినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఖర్గ్‌లో ఉత్పత్తి అవుతున్న చమురు ఎగుమతితో ఆర్థికంగా బలోపేతమవుతున్న ఇరాన్‌ను.. దీర్ఘకాలంలో దెబ్బతీయలేమని ట్రంప్ గ్రహించినట్టు వినికిడి. ఈ క్రమంలోనే ఆ ద్వీపంపై దాడులు జరిపి ఇరాన్‌ను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం. ఖర్గ్‌పై దాడులు చేస్తే ఇరాన్‌ను దెబ్బతీయవచ్చన్న విషయం నిజమైనప్పటికీ, ఈ చర్య అటు అమెరికాకు, ఇటు ఇజ్రాయెల్‌కు కొత్త ఇబ్బందులు తీసుకురావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇప్పటికే చమురు ధరలు బ్యారెల్‌కు 110-115 డాలర్లకు చేరుకొన్నాయి. ఇప్పుడు ఖర్గ్‌పై దాడులు జరిగితే ఈ ధరలు మరో 10 డాలర్ల మేర పెరిగే ప్రమాదమున్నది.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: