టైమ్ మ్యాగజైన్ (Times Magazine)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన సొంత సోషల్ మీడియా సోషల్ ట్రూత్(Social Truth)లో మ్యాగజైన్‌పై రాసుకొచ్చారు. టైమ్ మ్యాగజైన్ ప్రచురితం చేసిన ఓ కథనం కవర్ పేజీపై తన ఫొటోలో జుట్టు సరిగా కనిపించకపోవడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ మీద టైమ్ మాగజైన్ His Triumph అనే కథన ప్రచురితం చేసింది. గాజా శాంతి ఒప్పందంలో ఆయన చేసిన కృషికిగానూ ఈ కథనం ప్రచురించింది.
Read Also: MTV: ఎమ్‌టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేతను ప్రకటించిన యాజమాన్యం
ఇది చెత్త ఫోటో అంటూ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
టైమ్ మ్యాగజైన్‌లో తన గురించి ప్రచురితం అయిన కథనం సంతృప్తి పరంగా ఉందని.. కానీ కవర్‌పై ఉన్న ఫోటో అసలు బాగలేదని పేర్కొన్నారు. తన జుట్టును కనిపించకుండా చేశారని మండిపడ్డారు. జుట్టుపై ఏదో తేలియాడుతున్నట్లుగా చూపించారన్నారు. ఈ ఫోటో చూడటానికి చాలా విచిత్రంగా ఉందని తెలిపారు. తనకు ఎప్పుడూ కింది యాంగిల్ నుంచి తీసే ఫోటోలు నచ్చవని స్పష్టం చేశారు. తన ఫోటోల్లో ఇది చెత్త ఫోటో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే దీన్ని ఖండిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఎందుకు చేస్తున్నారు..? ఏం చేస్తున్నారు..? అంటూ టైమ్ మ్యాగజైన్ మేనేజ్‌మెంట్‌పై ట్రంప్ మండిపడ్డారు. అయితే.. టైమ్ మ్యాగజైన్‌ను ట్రంప్ విమర్శలు చేయడం ఇదే తొలిసారేం కాదు. ఫిబ్రవరిలో.. డోజ్ చీఫ్‌గా ఉన్న ఎలాన్ మస్క్ ఓవల్ ఆఫీస్‌లో రెజల్యూట్ డెస్క్ మీద కూర్చున్నట్లు ఓ ఫొటోను టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది. ఆ సమయంలో ట్రంప్ ఆ ఫోటోను చూస్తూ.. అసలు టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తుంది అనుకోలేదు అంటూ ఎద్దేవా చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: