📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump : సబ్సిడీలు లేకుంటే.. బహుశా మస్క్‌ తన దుకాణాన్ని మూసివేయాల్సి ఉంటుంది .. ట్రంప్‌

Author Icon By Sudha
Updated: July 1, 2025 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెక్‌ మిలియనీర్‌, టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)‌ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. మానవ చరిత్రలో ఎవరూ పొందలేని రాయితీలను మస్క్ తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆ సబ్సిడీలే లేకపోయి ఉంటే మస్క్‌ తన దుకాణాన్ని మూసివేసి.. దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి (close shop return home) వచ్చేది అని ట్రంప్‌ హెచ్చరించారు. అధ్యక్షుడు ట్రంప్, మస్క్‌ మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవలే ట్రంప్‌ యంత్రాంగం తీసుకొచ్చిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు (Big Beautiful Bill) విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ బిల్లును మస్క్‌ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతో ఈ బిల్లు కారణంగా మిత్రులు కాస్తా శత్రువులయ్యారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుపై మస్క్‌ మరోసారి విరుచుకుపడ్డారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలను తగ్గించి, అమెరికన్ల రుణాన్ని పెంచే ప్రజాదరణ లేని ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే చట్ట సభ సభ్యులను పదవీచ్యుతులను చేస్తానంటూ బెదిరించారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే మరుసటి రోజే తాను కొత్త పార్టీ పెడతానంటూ హెచ్చరించారు.

Donald Trump : సబ్సిడీలు లేకుంటే.. బహుశా మస్క్‌ తన దుకాణాన్ని మూసివేయాల్సి ఉంటుంది .. ట్రంప్‌

ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తులు ఉండవు
మస్క్‌ హెచ్చరికలపై ట్రంప్‌ తాజాగా ఘాటుగా స్పందించారు. ‘మానవ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరూ పొందలేని రాయితీలను మస్క్ పొందారు. ఆ సబ్సిడీలు లేకుంటే.. బహుశా మస్క్‌ తన దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాలోని తన ఇంటికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇకపై రాకెట్‌, ఉపగ్రహ ప్రయోగాలు, ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తులు ఉండవు. మన దేశం చాలా సందపను ఆదా చేసుకుంటుంది. ఈ అంశాన్ని డోజ్‌ పరిశీలించాలి. చాలా డబ్బు ఆదా అవుతుంది’ అని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.
కొత్త పార్టీకి సమయం ఆసన్నమైంది
అంతకు ముందు ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’పై మస్క్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం గురించి ప్రచారం చేసి.. ఇప్పుడు చరిత్రలో అతిపెద్ద రుణభారాన్ని పెంచే బిల్లుపై ఓటు వేసిన ప్రతి కాంగ్రెస్‌ సభ్యుడు సిగ్గుతో తల దించుకోవాలి. ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీకి సమయం ఆసన్నమైంది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. మరుసటి రోజే ‘ది అమెరికా పార్టీ’ ఏర్పడుతుంది’ అని మస్క్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.
కాగా, ఇటీవలే ట్రంప్‌ యంత్రాంగం తెచ్చిన ‘బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు’ను మస్క్‌ వ్యతిరేకించడంతోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ బిల్లు విషయంలో ట్రంప్‌పై మస్క్‌ నేరుగానే విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ను అభిశంసించి, ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌నకు సంబంధాలున్నాయని, ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరుందని, అందుకే దానిని ఆయన బయటపెట్టడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Read Also:India-China: చైనాతో స్థిరమైన సంబంధాలపై భారత్‌ దృష్టి : జైశంకర్‌

Big Beautiful Bill Musk criticism Breaking News in Telugu Elon Musk Trump feud July 2025 Google news Google News in Telugu Government subsidies for Tesla SpaceX Latest News in Telugu Musk close shop return South Africa Musk political party new Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Trump DOGE investigates Musk Trump slams Elon Musk subsidies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.