అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)ను నోబెల్ శాంతి బహుమతి(Nobel peace prize)కి నామినేట్ చేసినట్టు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు చెందిన బడ్డీ కార్టర్ ఈ నామినేషన్‌ను సమర్పించారని పేర్కొంది. మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లబరిచేందుకు ట్రంప్ తీసుకున్న యత్నాలే ఈ నామినేషన్‌కు కారణంగా లేఖలో తెలిపారు.
ఇజ్రాయెల్-ఇరాన్ వివాద పరిష్కారానికి ట్రంప్ కృషి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరిగిన దాడులు, ప్రతిదాడులు ప్రపంచానికి ఆందోళన కలిగించగా, ట్రంప్ జోక్యం వల్ల కాల్పుల విరమణకు దారితీసిందని పేర్కొంటున్నారు. ఈ పరిణామంలో ట్రంప్ ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు చేసిన కృషిని గుర్తించి ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు పాకిస్తాన్‌తో సంబంధాల మెరుగుదల, ఆబ్రహం ఒప్పందాల క్రమంలోనూ ట్రంప్ పలు శాంతియుత చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.
పోటీలో మరో 338 మంది ఉన్నా… ట్రంప్ పేరు చర్చలోకి
2024 నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రపంచవ్యాప్తంగా 338 మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయని నోబెల్ కమిటీ ప్రకటించింది. అయితే ట్రంప్ పేరు ఓ ప్రముఖ నామినేషన్‌గా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే యూఎస్ ప్రతినిధి డారెల్ ఇస్సా కూడా ట్రంప్‌కు మద్దతు తెలుపుతూ ఆయనను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డు విషయంలో చివరి నిర్ణయం నోబెల్ కమిటీదే అయినా… ట్రంప్ పేరు చర్చకు కేంద్ర బిందువుగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read Also : Family Man 3: ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్