📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: ట్రంప్ పై కాల్పుల ఘటనలో ఆరుగురు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై వేటు

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల(America President Elections) ప్రచారం సమయంలో పెన్సిల్వేనియాలోని బట్లర్ కౌంటీలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)పై హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కాల్పుల కేసులో భద్రతా వైఫల్యంపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు సీక్రెట్ సర్వీస్(Secret Service) ఉద్యోగులను సస్పెండ్(Suspended)చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. భవిష్యత్తులో వీరందరినీ కీలక విధులకు దూరంగా ఉంచుతామని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా బట్లర్‌లో జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత సీక్రెట్ సర్వీస్ దేనని కూడా చెప్పారు. ఈ ఉదంతం అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన భద్రతా లోపాలలో ఒకటిగా నిలుస్తోంది.

Trump: ట్రంప్ పై కాల్పుల ఘటనలో ఆరుగురు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై వేటు

ట్రంప్‌పై కాల్పులు చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్
ఈ దారుణ ఘటన 2024 జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ట్రంప్ ఎన్నికల ర్యాలీలో చోటు చేసుకుంది. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే సాయుధుడు ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయం అయింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అప్రమత్తమై ట్రంప్‌ను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పులు జరిపిన క్రూక్స్‌ను సీక్రెట్ సర్వీస్ స్నిపర్ కాల్చి చంపారు. అయితే క్రూక్స్ జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఇది కేవలం ఒక దురదృష్టకర సంఘటన కాదని, స్పష్టమైన కార్యాచరణ వైఫల్యం అని సీక్రెట్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ మాట్ క్విన్ అంగీకరించారు.
సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని తాజాగా సస్పెండ్
ఈ ఘటన తర్వాత సీక్రెట్ సర్వీస్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి ప్రతిస్పందనగా.. ఆరుగురు సీనియర్ సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని తాజాగా సస్పెండ్ చేశారు. వారికి 10 నుండి 42 రోజుల వరకు జీతం లేని సెలవు (unpaid leave) విధించడంతో పాటు సస్పెన్షన్ కాలంలో వారికి ఎటువంటి ప్రయోజనాలు అందించకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వీరంతా తిరిగి విధుల్లో చేరిన తర్వాత కూడా వీరిని ఆపరేషనల్ బాధ్యతలు తక్కువగా ఉండే లేదా పరిమిత విధులు గల విభాగాలకు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఏజెంట్లను పూర్తిగా తొలగించకపోవడంపై వచ్చిన విమర్శలకు క్విన్ సమాధానమిస్తూ.. ప్రధాన కారణాలను పరిష్కరించడంపైనే తమ దృష్టి పెట్టామని చెప్పారు.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. అప్పటి సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన ద్విపక్ష హౌస్ టాస్క్ ఫోర్స్ నివేదిక.. ప్రణాళిక, అమలు, నాయకత్వంలో అనేక వైఫల్యాలు ఉన్నాయని గుర్తించింది. ర్యాలీ జరిగిన బహిరంగ ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడం, అడ్వాన్స్ ప్లానింగ్ పాత్రలలో అనుభవం లేని సిబ్బందిని నియమించడం వంటి లోపాలు ఈ ప్రమాదకరమైన పరిస్థితికి దారితీశాయని నివేదిక స్పష్టం చేసింది .

ట్రంప్ ఆదాయం 
దశాబ్దాలుగా, ఫోర్బ్స్ అతని సంపదను అంచనా వేసింది, ప్రస్తుతం జూన్ 2025 ప్రారంభంలో $5.1 బిలియన్లుగా అంచనా వేసింది. అదే సమయంలో, బ్లూమ్‌బెర్గ్ జనవరి 2025లో అతని సంపదను $7.08 బిలియన్లుగా అంచనా వేసింది. 2025 ప్రారంభంలో ట్రంప్ సొంత క్రిప్టోకరెన్సీ అయిన $Trumpను ప్రారంభించిన తర్వాత, Axios తాత్కాలికంగా అతని నికర విలువను $58 బిలియన్లుగా అంచనా వేసింది.
ట్రంప్ పుట్టుపూర్వోత్తరాలు
న్యూయార్క్ నగరంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన ట్రంప్ 1968లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Amit Shah: రాజకీయాల రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేసుకుంటా: షా

#telugu News Secret Service agents removed Secret Service suspension Trump assassination attempt Trump security breach Trump shooting incident US Secret Service news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.