📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Telugu News:Trump:వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

Author Icon By Pooja
Updated: December 17, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకరి తప్పు ఆ ప్రభావం అనేకులపై పడుతుంది. అందుకే ఏదైనా చెడు చేయాలనుకున్నప్పుడు వాటి పర్యవస్థానం ఏమిటో కూడా ఆలోచించాలి. ఆవేశంలో నో.. ఉద్దేశపూర్వకంగానో నేరాలు చేసినప్పుడు వాటివల్ల కలిగే నష్టం మాటల్లో చెప్పలేనిది. ఇటీవల వైట్ హౌస్ సమీపంలో ఆఫ్ఘానిస్తాన్ కు చెందిన వ్యక్తి జరిపిన కాల్పుల వల్ల ఆ ప్రభావం అనేకులపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను పడింది. అసలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) వలస వాదులపై ఉక్కుపాదాన్ని మోపుతూ విదేశీయుల రాకను యుద్ధప్రాతిపదికంగా అడ్డుకుంటున్నారు.

Read Also:America: లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్

Trump: Shooting at the White House… those citizens are not allowed entry!

రోజుకో కొత్త వీసా నిబంధనలతో విదేశీయుల రాకను అడ్డుకోవడంలో విజయాన్ని సాధించారు. తాజాగా వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల వల్ల ఐదు దేశాల పౌరులకు అమెరికాకు రాకుండా ట్రంప్(Trump) అడ్డుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డపై ఆఫ్ఘన్ జాతీయుడు కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో, దేశ భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా మరిన్ని దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విస్తరించింది. మరో ఐదు దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తిగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుర్కినా ఫాసో, మాలీ, నైజర్, సౌత్ సుడాన్, సిరియా ఈ దేశాల నుంచి వలస లేదా పర్యటక వీసాల జారీపై పూర్తి నిషేధం అమలులోకి రానుంది.

15 దేశాల పౌరుల ప్రవేశ నిబంధనలు కఠినం

వీటితోపాటు, మరో 15 దేశాల పౌరుల ప్రవేశ నిబంధనలను కూడా అమెరికా కఠినతరం చేసింది. ఈ దేశాల పౌరులకు వీసాలు జారీ చేసే విషయంలో భద్రతా తనిఖీలను మరింత పక్కాగా అమలు చేయనున్నారు. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ట్రావెల్ డాక్యుమెంట్లు ఉన్నవారిపై కూడా పూర్తిస్థాయి ప్రయాణ ఆంక్షలు విధించారు. ఈ నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ, అమెరికా ప్రభుత్వం జాతీయ భద్రతనే ప్రధానమని స్పష్టం చేసింది.

నిషేధం విధించిన దేశాల్లో ‘అవినీతి, నకిలీ పౌరపత్రాలు, నేత చరిత్ర’ వంటి సమస్యలు ఉన్నందున, వారిని అమెరికాకు వచ్చేముందు పూర్తిస్థాయిలో పరిశీలించడం కష్టమని పేర్కొంది. కొన్నిదేశాల నుంచి వచ్చే పౌరులు తమ వీసాల గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉండిపోవడం, తిరిగి తమ పౌరులను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వైట్ హౌస్(White House) తెలిపింది. వైట్ హౌస్ సమీప కాల్పుల ఘటనతో అప్రమత్తమైన ట్రంప్ సర్కార్, అమెరికా భద్రతకు ముప్పు కలిగించే ఏ విదేశీయుడినీ అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.