📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Telugu News: Trump: భారత్ లో చిక్కుకుపోయిన హెచ్-1బీ వీసాదారులకు షాక్ మీద షాక్ లు

Author Icon By Sushmitha
Updated: December 15, 2025 • 1:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Trump) రెండవసారి ఎన్నికైన తర్వాత వలసదారులపై తనదైన కఠిన నిబంధనల్ని చూపుతున్నారు. విదేశీయుల రాకను ఘననీయంగా తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ట్రంప్ విధానాలవల్ల భారతీయుల పరిస్థితి కడుదయనీయంగా ఉంది. ప్రత్యేకంగా భారత్ కు హెచ్-1బీ వీసా (H-1B visa) రెన్యూవల్ కోసం వచ్చి, ఇక్కడే చిక్కుకుపోయిన నిపుణుల పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.

Read Also: Modi: నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

ఈ నెలలో జరగాల్సిన హెచ్-1బీ అపాయింట్మెంట్లను పలు కారణాలతో అమెరికా (America) ప్రభుత్వం రెండు నెలలపాటు వాయిదా వేయడంతో ఇక్కడికి వచ్చిన భారతీయులు చిక్కుకుపోయారు. దీంతో వీరి వీసాల్ని కూడా అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో హెచ్-1ఈ వీసా అపాయింట్ మెంట్ కోసం వచ్చి ఇలా చిక్కుకుపోయిన వారిలో ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Trump Shock upon shock for H-1B visa holders stranded in India

రెండునేలలు వాయిదా డబుల్ షాక్ లు

డిసెంబరులో భారత్ లో జరగాల్సిన హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూల్ని వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలకు వాయిదా వేస్తున్నట్లు తాజాగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇక్కడే ఉండే ఆపాయింట్ మెంట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్ద షాక్ తగిలినట్లయింది. ఇందులో నుంచి వారు కోలుకోకముందే. అమెరికాలో ఉంటూ జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్ మెంట్లు ఫిక్స్ చేసుకుంటున్న వారితో వీరు పోటీ పడాల్సి రావడంతో మరో షాక్ గా మారుతోంది. దీంతో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలకు లేదా ఆ తర్వాత హెచ్-1బీ వర్క్ వీసాలు కలిగి ఉన్న వందలాది మంది భారతీయ నిపుణులు భారత్ లో చిక్కుకుపోయారు.

ఓ నెటిజన్ ఆవేదన..

తోటి భారతీయులారా, మీరు అమెరికాలో ఉండి జనవరి/ఫిబ్రవరి నెలలకు హెచ్-1బీ అపాయింట్ మెంట్ లను బుక్ చేసుకున్నట్లయితే లేదా బుక్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, దయచేసి, బుకింగ్ చేసుకోవద్దు. లేదా దయచేసి మీ బుక్ చేసిన అపాయింట్ మెంట్ లను రద్దు చేసుకోండి. దయచేసి ఇక్కడ చిక్కుకుపోయిన మాకు అమెరికాలోని మా ఉద్యోగాలకు తిరిగి రావడానికి అవకాశం ఇవ్వండి. మేమంతా తీవ్ర ఒత్తిడికి గురయ్యాం. జనవరి, ఫిబ్రవరిలో స్లాట్లు తెరిచే వరకూ వేచి చూడటం తప్ప మాకు వేరే మార్గం లేదు’ అని సదరు రెడ్డిట్ యూజర్ తెలిపారు. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Donald Trump H-1B Visa Google News in Telugu H-1B visa holders stuck in India H-1B visa renewal issues impact on Indian tech workers Indian H-1B workers concerns Latest News in Telugu Telugu News Today Trump administration visa restrictions US immigration policy shock. US visa policy changes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.