ఇరాన్‌లో నెలకున్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పెద్ద సైనిక దళం ఇరాన్ దిశగా వెళ్తోందని ఆయన అన్నారు. ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగిస్తూనే, సైనిక చర్య ఉండకపోవచ్చని ఆయన ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గత వారం, ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై జరిగిన హింసాత్మక అణచివేతపై ట్రంప్ (Trump) తీవ్రంగా స్పందించారు. నిరసనకారుల మరణశిక్షలను ఇరాన్ నిలిపివేసిందని వైట్‌హౌస్ పేర్కొనడంతో టెహ్రాన్‌పై దాడి చేస్తానన్న బెదిరింపులను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. అయితే, గురువారం మాత్రం మళ్లీ మాట మార్చిన అమెరికా అధినేత.. సైనిక సన్నాహాలు కొనసాగుతున్నాయని ధ్రువీకరించారు. అమెరికా మీడియా నివేదికల ప్రకారం.. గతవారం USS అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు తరలించాలని ఆదేశించారు.
Read Also: Trump: ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు పాక్ సహా 8 ఇస్లామిక్ దేశాల అంగీకారం
‘ఒక ఆర్మాడా’, ‘భారీ నౌకాదళం’
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్ నుంచి తిరిగి వస్తూ ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ ‘మేము ఇరాన్‌ను గమనిస్తున్నాం’ అని చెప్పారు. ‘మీకు తెలుసు, మేము ముందుజాగ్రత్తగా చాలా నౌకలను ఆ దిశగా పంపుతున్నాం… మేము ఒక పెద్ద సైన్యాన్ని ఇరాన్ వైపు పంపుతున్నాం’ అని తెలిపారు. ఏమీ జరగకూడదని తాను కోరుకుంటున్నాను, కానీ మేము వారిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన ఆ సైనిక దళాన్ని ‘ఒక ఆర్మాడా’, ‘భారీ నౌకాదళం’ అని అభివర్ణించారు. బహుశా దానిని ఉపయోగించాల్సిన అవసరం ఉండకపోవచ్చని అన్నారు. తన బెదిరింపులతోనే ఇరాన్ 837 మంది నిరసనకారుల ఉరిశిక్షలను ఆపివేసిందని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్‌తో మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: