📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest News: Donald Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి దగ్గరలో ఉన్నామన్న ట్రంప్

Author Icon By Aanusha
Updated: November 11, 2025 • 10:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుకు చాలా దగ్గరగా ఉందని వెల్లడించారు. ఇది గతంలో కుదిరిన ఒప్పందాల కంటే విభిన్నంగా ఉండి, రెండు దేశాలకు సమాన ప్రయోజనం చేకూర్చేలా రూపొందిస్తున్నామని చెప్పారు.

Read also: David Szalay: డేవిడ్ సలయ్‌కి ‘బుకర్ ప్రైజ్’

అందరికీ ప్రయోజనం కలిగించేలా ఈ ఒప్పందం రూపుదిద్దుకుంటోందని ట్రంప్ తెలిపారు. భారత్‌కు అమెరికా నూతన రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్, ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. గోర్‌తో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ (Scott Bessant)  హాజరయ్యారు.ఈ సందర్భంగా ట్రంప్ (Donald Trump)మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తో తనకు అద్భుతమైన సంబంధాలున్నాయని అన్నారు.

 Donald Trump

ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి

అమెరికా (America) కు ఉన్న అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో భారత్‌తో ఉన్న వ్యూహాత్మక బంధం ఒకటని ఆయన అభివర్ణించారు. “ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటైన భారత్ అద్భుతమైన దేశం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మాకు ముఖ్యమైన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతా భాగస్వామి.

సెర్గియో నియామకంతో ఈ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని నేను విశ్వసిస్తున్నాను” అని ట్రంప్ పేర్కొన్నారు.అక్టోబర్‌లో సెనేట్ ఆమోదం పొందిన 38 ఏళ్ల సెర్గియో గోర్, భారత్‌కు అత్యంత పిన్న వయస్కుడైన అమెరికా రాయబారిగా రికార్డు సృష్టించారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఈయన, గతంలో వైట్‌హౌస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

ఈ సందర్భంగా గోర్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించినందుకు అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మాట్లాడుతూ.. “అధ్యక్షుడు, నేను ఇద్దరం భారత్‌ను ప్రేమిస్తాం” అని వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also:

Donald Trump Economic Relations India US Trade Deal Indo American Partnership latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.