📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Latest Telugu News: Pak vs Afg: యుద్ధాలను ఆపడం నాకు చాలా తేలిక..ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: October 18, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్(Trump) ఇప్పుడు తొమ్మిదో యుద్ధాన్ని ముగించడానికి సిద్ధమయ్యారు. పాకిస్తాన్(Pakistan), ఆఫ్ఘనిస్తాన్‌ల(Afghanistan) మధ్య జరుగుతున్న వార్ గురించి ట్రంప్ మాట్లాడారు. దానిని పరిష్కరించడం తనకు సులభమైన పని అన్నారు. అంతేకాదు లక్షలాది మంది ప్రాణాలను కాపాడటం అంటే తనకు ప్రేమని.. నోబెల్ కోసమే తాను యుద్ధాలను ఆపలేదని మరోసారి చెప్పుకున్నారు. శుక్రవారం మీడియా హౌస్‌లో పాక్, ఆఫ్ఘాన్ వార్ గురించి మాట్లాడారు.

Read Also: Khawaja Asif: ఆఫ్ఘన్, పాక్ యుద్ధం వెనుక భారత్ ఉంది: రక్షణ మంత్రి

శాంతి విషయంలో ఎప్పుడూ ముందుంటాను ..ట్రంప్

నాకు నోబెల్ బహుమతి రాలేదు కానీ…శాంతి విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగేయని ట్రంప్ మరోపారి ఉద్ఘాటించారు. రువాండా, కాంగోలకు వెళ్ళి అడగండి…తాను పరిష్కరించిన యుద్ధాలన్నీ చూడండి..కావాలంటే రుజువుగా అంటూ చెప్పుకొచ్చారు. నోబెల్ బహుమతి వచ్చిన మహిళ ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఆమె నా గురించి అర్థం చేసుకుంది. అందుకే పీస్ బహుమతి ప్రకటించగానే నాకు ఫోన్ చేసి నేను అర్హుడునని చెప్పింది అన్ని ట్రంప్ అన్నారు. అయినా నాకు ఆ విషయాలన్నీ పట్టవని…ప్రాణాలు కాపాడ్డం మీదనే శ్రద్ధవహిస్తానని తెలిపారు. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘన్‌ల మధ్య యుద్ధం ఆపితే..తొమ్మిదవ అవుతుంది. ఇంత వరకు ఏ అధ్యక్షుడూ ఇన్ని వార్‌లను ఆపిందిలేదు. బుష్ ఒక యుద్ధాన్ని ప్రారంభించాడు…నేను పది లక్షల ప్రాణాలను కాపాడాను అని ట్రంప్ చెప్పారు.

Pak vs Afg: యుద్ధాలను ఆపడం నాకు చాలా తేలిక..ట్రంప్

మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆహ్వానించారు. ట్రంప్ తమ మధ్య యుద్ధాన్ని ఆపడం స్వాగతించదగినదని అన్నారు. వార్‌లను ఆపిన మొదటి అధ్యక్షుడు ట్రంప్ అని కొనియాడారు.

ఆఫ్ఘనిస్తాన్‌ పై పాకిస్తాన్ దాడులు

అయితే పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్‌ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తోంది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నా దాడులు చేసతోంది. అర్థరాత్రి వైమానికి దాడులు పాల్పడుతూ చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా నిన్న పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్‌లో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లతో సహా ఎనిమిది మంది చనిపోయారు. వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగే ట్రైసీరీస్ కోసం క్రికెటర్లు పాకిస్తాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుంచి షరానాకు ప్రయాణించారని ఆఫ్ఘనిస్తాన్ బోర్డు తెలిపింది. వారు ముగ్గురూ బీర్, సిబ్ఘతుల్లా, హరూన్‌లని వెల్లడించింది. వీరితో పాటూ దాడిలో మరో ఐదుగురు వ్యక్తులు కూడా మరణించారు. ఉర్గున్‌లో క్రికెటర్లు అందరూ కలుస్తారని తెలిసే పాకిస్తాన్ దాి చేసిందని తాలిబన్లు ఆరోపిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Donald Trump statement Telugu News trump foreign policy Trump on global conflicts Trump on wars Trump peace talks US presidential election 2024

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.