📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Ukrain War: రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు

Author Icon By Vanipushpa
Updated: October 23, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్​తో యుద్ధాన్ని ముగించాలని రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump)మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా(Russia)కు చెందిన రెండు అతిపెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించారు. దీంతో లుకాయిల్‌, రోస్‌నెఫ్ట్‌పై ప్రభావం పడుతుంది. ఈ ఆంక్షలు తీవ్రమైనవి, తర్వగా యుద్ధం పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇది ఒక ముఖ్యమైన రోజు అవుతుంది. ఇవి ఎంతో పెద్ద, ప్రభావవంతమైన ఆంక్షలు. వాటిని రష్యా రెండు ప్రముఖ చమురు కంపెనీలపై విధించాం. యుద్ధం పరిష్కారం అవుతుందని మేం ఆశిస్తున్నాం. క్షిపణులు, ఇతర ఆయుధాలపై వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చాం. కానీ వాటి అవసరం రాకూడదని భావిస్తున్నాం. వారు చాలా కాలంగా ఏర్పాటు చేసుకున్న సరిహద్దుల వద్దే ఆగి ఇంటికి తిరిగి వెళ్లాలని మేం కోరుకుంటున్నాం.

Read Also: Uganda: ఉగాండా రాజధానిలో విషాదం – 63 మంది మృతి

Ukrain War

8వేల మంది సైనికులు మరణించారు

గతవారం దాదాపు 8వేల మంది సైనికులు మరణించారు. రష్యన్లు, ఉక్రెయిన్లు ఇద్దరూ చనిపోయారు. ఇది చాలా విచిత్రమైన విషయం. ఇది ముగియాలని మేం కోరుకుంటున్నాం. ఈ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. నేను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే ఈ యుద్ధం మొదలయ్యేది కాదు’ అని ట్రంప్ వైట్ హౌస్‌లో నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు ఆంక్షలు విధించారు అనే అడిగిన ప్రశ్నలకు, ఇది సరైన సమయం అనిపించిదని ట్రంప్ చెప్పారు. తాము చాలా కాలంగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. ట్రంప్ నిర్ణయాన్ని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్​ ప్రశంసించారు. ఉక్రెయిన్‌లో శాంతి సాధనలో ట్రంప్ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమైనవి అన్నారు.

శాంతి ప్రక్రియపై రష్యాకు నిబద్ధత లేదు

అలాగే రష్యాపై ఆంక్షలు విధిస్తున్నట్లు యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫారిన్‌ అసెట్స్‌ కంట్రోల్‌ ఆఫీస్‌ (OFAC) ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించడమే కాకుండా శాంతి ప్రక్రియపై రష్యాకు నిబద్ధత లేకపోవడం వల్లే ఈ ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. తమ నిర్ణయం ఆ దేశ చమురు రంగంపై ఒత్తిడి పెంచుతుందని, దీనివల్ల రష్యా ఆర్థికవ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని వెల్లడించింది. శాశ్వత శాంతి పూర్తిగా రష్యా చర్చలు జరపడానికి రావడంపై ఆధారపడి ఉందని తెలిపింది. యుద్ధం కారణంగా జరుగుతున్న హత్యలను ఆపడంతో పాటు తక్షణ కాల్పుల విరమణకు సమయం ఆసన్నమైందని ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ తెలిపారు.

భారత్‌ నుంచి తనకు హామీ

మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం గురించి ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి భారత్​ చమురు దిగుమతులను భారీగా తగ్గిస్తుందని పేర్కొన్నారు. తగ్గింపు క్రమంగా ఉంటుందని, ఇది మంచి చర్య అని అన్నారు. ఈ మేరకు భారత్‌ నుంచి తనకు హామీ వచ్చిందని కూడా పునరుద్ఘాటించారు. ట్రంప్ చేస్తున్న ఈ వాఖ్యలపై భారత్‌ ఖండిస్తూనే వస్తుంది. అయినా, అగ్రరాజ్యం అధ్యక్షుడు మళ్లీ మళ్లీ ఇలాంటి ప్రకటనలే చేయడం గమనార్హం.

భారతదేశం రష్యాకు ఎందుకు మద్దతు ఇస్తోంది?
భారతదేశ చరిత్రలో క్లిష్ట సమయాల్లో రష్యా ఒక బలమైన స్తంభంగా నిలిచింది. భారతదేశం ఎల్లప్పుడూ ఈ మద్దతును ప్రతిస్పందిస్తుంది. అణుశక్తి మరియు హైడ్రోకార్బన్‌లు రెండింటిలోనూ మన ఇంధన భద్రతకు రష్యా మన అత్యంత ముఖ్యమైన రక్షణ భాగస్వామి మరియు కీలక భాగస్వామిగా ఉంది మరియు అలాగే ఉంటుంది.

ఇప్పుడు రష్యా ప్రధాన మంత్రి ఎవరు?
మిఖాయిల్ మిషుస్టిన్
రష్యా / ప్రధాన మంత్రి
మిఖాయిల్ మిషుస్టిన్. మిఖాయిల్ వ్లాదిమిరోవిచ్ మిషుస్టిన్ (జననం 3 మార్చి 1966) ఒక రష్యన్ రాజకీయవేత్త మరియు ఆర్థికవేత్త, 2020 నుండి రష్యా ప్రధాన మంత్రిగా పనిచేస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Donald Trump Energy Sector Global Economy International Politics Oil Companies russia Telugu News US sanctions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.