📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Russia: రష్యాతో చర్చలు-యుద్ధం ముగింపు దిశగా అడుగులు : ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: December 4, 2025 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో అమెరికా ప్రతినిధి బృందం చర్చలు బాగా జరిగాయని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. ఆ చర్చలు తర్వాత పుతిన్ యుద్ధం ముగించాలని కోరుకుంటున్నారనే ఒక భావన కలిగిందని తెలిపారు. ఓవల్​ ఆఫీస్​లో విలేకర్లుతో ట్రంప్ ఈ మేరకు మాట్లాడారు. ‘జేర్డ్‌ కుష్నర్‌, స్టీవ్ విట్కాఫ్‌తో కలిసి పుతిన్ చాలా మంచి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం ఫలితాలు ఏ విధంగా ఉంటుందో నేను చెప్పలేను. ఏమి వస్తుందో చెప్పలేను, ఎందుకంటే ఇది ఇద్దరూ కలిసి చేయాల్సిన ప్రక్రియ. అయితే పుతిన్ మాత్రం యుద్దాన్ని ముగించాలని కోరుకుంటున్నారు.

Instagram: వర్క్ ఫ్రం హోం వాళ్ళు ఇక ఆఫీసుకు రావాల్సిందే..

Donald Trump

భూభాగ సంబంధిత అంశాల్లో ఎటువంటి రాజీ కుదరలేదు

మరోవైపు ఈ చర్చల్లో ఉక్రెయిన్​ నాటోలో చేరాలనే చేస్తున్న ప్రయత్నం కీలక ప్రశ్నగా ఉందని పుతిన్‌ సీనియర్‌ సలహాదారు యూరీ ఉషకోవ్‌ తెలిపారు. ఐదు గంటల పాటు జరిగిన చర్చల్లో పెద్ద పురోగతి సాధించలేకపోయినా కీవ్​ నాటో సభ్యత్వం ప్రధానంగా చర్చించామని పేర్కొన్నారు. ‘మా పరిగణనలను, కీలన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవడానికి అమెరికా భాగస్వాములు సిద్ధంగా ఉన్నారని వారు ధృవీకరించారు. భూభాగ సంబంధిత అంశాల్లో ఎటువంటి రాజీ కుదరలేదు. అయితే ఈ సమావేశం, యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా, రష్యా మధ్య జరిగిన అత్యంత విస్తృత చర్చలలో ఒకటి. రెండు పక్షాలు శాంతి కోసం పలు మార్గాలను పరిశీలించినప్పటికీ, ప్రధాన విభేదాలు అలాగే ఉన్నాయి.

అమెరికా నుంచి వచ్చే సంకేతాలపైనే తమ తదుపరి అడుగులు : జెలెన్​ స్కీ

మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్‌ రాయబారులు జరిపిన చర్చలపై సత్వర నివేదిక కోసం తాము ఎదురుచూస్తున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అమెరికా నుంచి వచ్చే సంకేతాలపైనే తమ తదుపరి అడుగులు ఆధారపడి ఉంటాయని ఐర్లాండ్‌ పర్యటనలో ఉన్న ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఈ యుద్ధాన్ని పరిష్కరించడానికి ట్రంప్ ప్రతినిధులు మాస్కోలో ఉన్నారని, కానీ అది అంత సులువు కాదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. అయితే ఉక్రెయిన్, యూరోపియన్ ప్రభుత్వాల ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటూ శాంతి ప్రణాళికను సవరించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్లకు పైగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ట్రంప్‌ ఈ 28 సూత్రాలను రూపొందించారు. వీటిలో రష్యాకు అనుకూలంగా ఉన్న అంసాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu Donald Trump Google News in Telugu International Diplomacy Latest In telugu news peace negotiations Russia Talks Telugu News Today War Resolution

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.