మరోరెండు మాసాలు గడిస్తే రష్యా-ఉక్రెయిన్ లమధ్య యుద్ధం నాలుగేళ్లు ముగిసి, ఐదోఏటలోకి ప్రవేశిస్తుంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీ రష్యా ఉక్రెయిన్ పై వైమానిక దాడులకు దిగింది. ఆనాటి నుంచి మొదలైన యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ప్రపంచదేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి అధికారంలో వచ్చిన రోజు నుంచి ఈరెండు దేశాలమధ్య యుద్ధాన్ని ఆపేందుకు యత్నిస్తూనే ఉన్నారు. ఇశ్రాయేల్-హమాస్ లమధ్య యుద్ధాన్ని ఆపన ఘనత ట్రంప్ కే దక్కుతుంది. (Trump) తాజాగా రష్యా-ఉక్రయిన్ మధ్య యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అవుతోంది. నాలుగేళ్ల నుంచి రెండు దేశాల మధ్య భీకర సాగుతోంది. చాలా రోజుల ఉంచి విఫలమవుతున్న చర్చలు మొత్తానికి ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఆదివారం ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశమై శాంతి ఒప్పందంపై చర్చించారు. 20 పాయింట్ల ప్రణాళికపై ఇరువురి నేతలు చర్చించారు. ఉక్రెయిన్ భద్రతపై ట్రంప్ హామీ ఇవ్వడంతో శాంతి చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. భేటీ తర్వాత జెలెన్ స్కీ-ట్రంప్ మాట్లాడుతూ శాంతి చర్చలు 90-95శాతం కొలిక్కి వచ్చాయని.. వచ్చే నెలలో పూర్తి పరిష్కారం దొరుకుతుందని జెలెన్ స్కీ అన్నారు. కాదు.. కాదు.. వచ్చేవారమే శాంతి ఒప్పందం జరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒక్క డాన్ బాస్ దగ్గరే పంచాయితీ తెగలేదని.. అది కూడా పరిష్కరించబడితే వచ్చే వారమే రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం జరగవచ్చని ట్రంపన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read also: Japan: చైనా-తైవాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. సైన్యం మోహరింపు
పుతిన్ తో ట్రంప్ సుదీర్ఘ మంతనాలు
జెలెన్ స్కీతో సమావేశానికి ముందు పుతిన్ తో(Putin) ట్రంప్ ఫోన్ కాల్ లో మాట్లాడారు. దాదాపు రెండున్నర గంటలు మాట్లాడినట్లు చెప్పారు. (Trump)ఉక్రెయిన్ లోని జపోరిజ్జియా అణువిద్యుత్ ప్లాంట్ భవిష్యత్తు గురించి పుతిన్ తో చర్చించానని.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అది రష్యా నియంత్రణలోనే ఉందని చెప్పారని.. ఇప్పుడైతే ఈ ప్లాంట్ ను తిరిగి ఉక్రెయిన్ కు అప్పగించేందుకు పుతిన్ సహకరిస్తున్నారని ట్రంప్ తెలిపారు. అంతేకాదు ఉక్రెయిన్ పునర్ నిర్మాణంలో కూడా పుతిన్ కూడా సహకరిస్తారని..ఆయన అంత మంచివాడు అంటూ ట్రంప్ కితాబు ఇచ్చారు.
శాంతి ఒప్పందానికి పుతిన్ ఒకే: ట్రంప్
శాంతి ఒప్పందానికి పుతిన్ చాలా దగ్గరగా ఉన్నారని.. త్వరలోనే ఉక్రెయిన్-రష్యా నేతలు కూడా కలుస్తారని ఆశాభావం కనుపరిచారు. ట్రంప్ శాంతి ప్రతిపాదనను పుతిన్ రాయబారి కిరిల్ డిమిత్రివ్ స్వాగతించారు. శాంతి కోసం ట్రంప్, అతని బృందం చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచదేశాలు అభినందిస్తున్నాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ప్రయతిస్తున్నట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: