అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ (Trump) ఇరాన్‌తో యుద్ధం గురించి మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధాన్ని త్వరలో ముగించాలని తాను భావిస్తున్నట్టు ‘ట్రూత్‌సోషల్’ లో ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు భూతల దాడుల కోసం సైన్యాన్ని దించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. యుద్ధాన్ని ముగించడం గురించి ట్రంప్ తన పోస్ట్‌లో రాశారు.”మా లక్ష్యాలను సాధించడానికి చాలా దగ్గరగా ఉన్నందున, ఇరాన్‌లో ఉగ్రవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యప్రాచ్యంలో ప్రారంభించిన మా ప్రధాన సైనిక కార్యకలాపాలను క్రమంగా ముగించాలని భావిస్తున్నాం” అని ట్రంప్ పేర్కొన్నారు.హార్ముజ్ జలసంధికి సంబంధించి ఆయన మరో విషయాన్ని ప్రస్తావించారు. “దానిని (హార్ముజ్ జలసంధిని) పర్యవేక్షించే, రక్షణ కల్పించే బాధ్యతను ఆ మార్గాన్ని ఉపయోగించుకునే దేశాలే తీసుకోవాలి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Read Also: Daejeon factory fire accident: దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

హార్ముజ్ జలసంధి భద్రతకు సాయం చేస్తాం
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం హార్ముజ్ జలసంధి మీదుగా జరుగుతుందని అంచనా. ”ఆయా దేశాలు కోరితే హార్ముజ్ జలసంధి భద్రతకు తీసుకునే ప్రయత్నాలలో మేం సాయం చేస్తాం” అని ట్రంప్ అన్నారు. “అయితే ఇరాన్ ముప్పు తొలగిపోయిన తర్వాత దీని అవసరం ఉండదు. ఈ దేశాలకు ఇదొక తేలికపాటి మిలటరీ ఆపరేషన్ అవుతుంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై యుద్ధంలో ఇప్పటివరకు సాధించిన విజయాలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం పూర్తిగా ధ్వంసమైందని, దాని సైనిక పారిశ్రామిక స్థావరం నాశనమైందని, తద్వారా అణ్వాయుధ అభివృద్ధి దరిదాపుల్లోకి కూడా ఇరాన్ రాదని ట్రంప్ తెలిపారు. మధ్యప్రాచ్యంలోని తన మిత్రదేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఇతర దేశాలకు అమెరికా అత్యున్నత స్థాయి భద్రతను కల్పించిందని ట్రంప్ అన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :