📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: USA: వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: December 5, 2025 • 11:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వలసదారులపై కఠిన నియమాలను అమలు చేస్తూనే ఉంది ట్రంప్(Trump) గవర్నమెంట్. ఇప్పటికే వీసాల విషయంలో పలు కఠిన నిర్ణయాలను తీసుకున్న యూఎస్‌ సిటిజన్‌షిప్‌, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శరణార్థులు, ఆశ్రయం పొందాలనుకునేవారు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నవారు, ఇతర చట్టపరమైన వలసదారులకు అందించే వర్క్ పరిమిట్ల కాలాన్ని కుదించారు. ఇప్పటి వరకు ఐదేళ్లుగా ఉన్న గరిష్ట కాల పరిమితిని కేవలం 18 నెలలకు తగ్గిస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) గురువారం ప్రకటించింది. ఇమ్మిగ్రేషన్ నియమాలు కఠినతరం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

Read Also: Putin Security: గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

USA Visa

భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం

అమెరికాలో శరణార్థులు, ఇతరులు ఉద్యోగం చేయాలంటే ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ కార్డ్‌ ను జారీ చేస్తారు. దీన్నే ఈఏడీఅంటారు. ఇంతకు ముందు హెచ్ 4 వీసా వాళ్ళకు కూడా ఈ ఈఏడీ వర్క్ పరిమితి కుదించారు. ఇప్పుడు శరణార్థులు, ఇతరులకు కూడా దీన్ని తగ్గించేశారు. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. దీని వలన తరుచుగా భద్రతా సమీక్షలు నిర్వహించడానికి వీలు అవుతుందని USCISచెప్పింది. అమెరికాలో పని చేయాలనుకునే వారు ప్రజల భద్రతకు ముప్పు కలిగించకుండా లేదా హానికరమైన అమెరికా వ్యతిరేక సిద్ధాంతాలను ప్రోత్సహించకుండా నియంత్రించడానికి ఈ కొత్త రూల్ దోహదపడుతుందని తెలిపింది.

లాస్ట్ మంత్డీసాలో వైట్ హౌస్ దగ్గర నేషనల్ గార్డ్స్ పై జరిగిన దాడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడి తరువాత వలసదారులపై మరింత తరచుగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో అన్నారు. ఈ మార్పులు డిసెంబర్ 5వ తేదీ లేదా ఆ తర్వాత దాఖలు చేయబడిన పెండింగ్‌లో ఉన్న, భవిష్యత్తులో వచ్చే అన్ని ఫారం I-765 దరఖాస్తులకు తక్షణమే వర్తిస్తాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu Donald Trump Google News in Telugu Immigration Reform Latest In telugu news Telugu News Today US Employment Authorization US Immigration Policy Visa Validity Work Permit Rules Work Visa Changes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.