📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Nobel: ఒబామా ఏం చేసాడని నోబెల్ బహుమతి ఇచ్చారు..ట్రంప్ అక్కసు

Author Icon By Vanipushpa
Updated: October 10, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace)…అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఇదో పెద్ద ప్రస్టీజ్ ఇష్యూ అయిపోయింది. రెండో సారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నోబెల్ శాంతి బహుమతికి టార్గెట్ చేశారు ట్రంప్. దానిపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. ఈరోజు ఆ అవార్డుల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రెస్ తో దీని గురించి మాట్లాడారు. గాజాతో పాటూ ప్రపంచంలో శాంతి నెలకొల్పానని ఆయన చెప్పుకున్నారు. ఎనిమిది యుద్ధాలను ఆపానని మరోసారి పునరుద్ఘాటించారు.

Trump US : ట్రంప్ జనరిక్ మందులపై సుంకాలను తాత్కాలికంగా నిలిపివేసారు

ఒబామా ఏం చేసాడని నోబెల్ బహుమతి ఇచ్చారు..ట్రంప్ అక్కసు

అమెరికాను నాశనం చేసిన ఒబామా..ట్రంప్

నోబెల్ శాంతి బహుమతి తనకు కచ్చితంగా రావాల్సిందేనని అన్నారు. తన అవార్డును ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ఏమీ చేయని ఒబామా లాంటి వారికి నోబెల్ ఇచ్చారు. తనకు ఎందుకు ఇవ్వరో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్. అమెరికాకు రెండుసార్లు అధ్యక్షుడిగా ఉన్న ఒబామా ఏమీ చేయలేదని…ఐగా అమెరికాను నాశనం చేశారని విమర్శించారు. అతనికి అవార్డ్ వచ్చింది. ఎందుకిచ్చారో అతనికి కూడా తెలియదు. బహుశా అమెరికాను నాశనం చేసినందుకు ఇచ్చి ఉంటారని ఒబామా గురించి వ్యాఖ్యలు చేశారు. కానీ నేను ఎనిమిది యుద్ధాలను ఆపడంలో విజయం సాధించానని అన్నారు. ఇలాంటిది ఇంతకు ముందు ఎవరూ చేయలేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇన్ని చేసినా తనకు నోబెల్ ఇవ్వరు. ఇవ్వరని కూడా నాకు తెలుసు. అయినా నేను ఆ అవార్డ్ కోసం ఏమీ చేయలేదు. ప్రజల ప్రాణాలు కాపాడ్డానికే యుద్ధాలను ఆపానని ట్రంప్ అన్నారు.

ట్రంప్ కు నోబెల్ ఇవ్వాల్సిందే..నెతన్యాహు

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ విషయమై మరోసారి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిని కచ్చితంగా ఇవ్వాలని ఆయన అంటున్నారు. దానికి ట్రంప్ అన్ని విధాలుగా అర్హుడని నెతన్యాహు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. పోస్ట్ తో పాటూ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి వచ్చినట్టు…దానిని తానే ఆయన మెడలో వేస్తున్నట్టు నెతన్యాహు ఏఐ పిక్ పెట్టారు. కాసేపట్లో శాంతి బహుమతిని అనౌన్స్ ఉందనగా నెతన్యాహు ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నోబెల్ శాంతి బహుమతిని ఎవరు నిర్ణయించారు?
నాలుగు బహుమతుల గ్రహీతలను స్వీడిష్ కమిటీ నిర్ణయిస్తుంది, అయితే శాంతి బహుమతి గ్రహీతను నార్వేజియన్ పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యులతో కూడిన నార్వేజియన్ కమిటీ నిర్ణయిస్తుంది.

నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నందుకు ఇచ్చే బహుమతి ఏమిటి?
ప్రతి గ్రహీత, గ్రహీత అని పిలుస్తారు, 24 క్యారెట్ బంగారంతో పూత పూసిన ఆకుపచ్చ బంగారు పతకం, డిప్లొమా మరియు ద్రవ్య పురస్కారాన్ని అందుకుంటారు. 2023 నాటికి, నోబెల్ బహుమతి ద్రవ్య పురస్కారం 11,000,000 kr, ఇది దాదాపు US$1,035,000కి సమానం.

ead hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Barack Obama Nobel Prize Donald Trump criticism Nobel Peace Prize controversy Obama achievements presidential rivalry Telugu News Trump vs Obama US Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.