📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Russia-Ukrain War: మరోసారి భేటీకి సిద్ధపడుతున్న ట్రంప్, పుతిన్

Author Icon By Vanipushpa
Updated: October 17, 2025 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా(Russua) ఉక్రెయిన్(Ukrain) మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)మరో కీలక అడుగు వేశారు. గతంలో అలస్కాలో జరిగిన భేటీలో శాంతి ఒప్పందం కుదరలేదు. ఈ క్రమంలో నిలిచిపోయిన ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి చర్చలను ట్రంప్ మరోసారి పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం(అమెరికా కాలమానం ప్రకారం) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ట్రంప్ కాల్ చేశారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగింపుపై చర్చించారు. ఈ వివరాలను తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ పంచుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో శుక్రవారం భేటీ కానున్నారు.

Read Also: Russia : భారతకు మా చమురు చాలా ముఖ్యం.. రష్యా

Russia-Ukrain War: మరోసారి భేటీకి సిద్ధపడుతున్న ట్రంప్, పుతిన్

యుద్ధం ముగింపుపై చర్చలు

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం తాను పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని ట్రంప్ వివరించారు. ఈ భేటీలోయుద్ధ ముగింపుపై చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ పుతిన్‌తో ఫోన్ సంభాషణ చాలా ఫలప్రదంగా జరిగినట్లు పేర్కొన్నారు. ఈ చర్చల ఫలితంగా త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గాజా శాంతి ఒప్పందంపై పుతిన అభినందనలు తెలిపారని ట్రంప్ వెల్లడించారు. మధ్యప్రాచ్య శాంతి ఒప్పందం రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు చర్చలకూ సానుకూలంగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. “నేను పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడాను. మా సంభాషణ చాలా ఫలప్రదంగా జరిగింది. శతాబ్దాలుగా కలలుగన్న మధ్యప్రాచ్య శాంతి ఇప్పుడు సాధ్యమైందని పుతిన్ అన్నారు.

వచ్చేవారం ఇరుదేశాల సలహాదారుల సమావేశం

ట్రంప్- పుతిన్ భేటీ కావడానికి ముందు రష్యా, అమెరికాకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు సమావేశం అవుతారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమావేశం వచ్చేవారం ఉంటుందని చెప్పారు. ‘అమెరికా తరఫున ఈ చర్చలను విదేశాంగ మంత్రి మార్కో రూబియో నేతృత్వం వహిస్తారు. సమావేశ స్థలం త్వరలో నిర్ణయిస్తాం’ అని ట్రంప్ వివరించారు. అలాగే, శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వైట్ హౌస్‌లో ట్రంప్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పుతిన్‌తో జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను తాను జెలెన్‌స్కీతో పంచుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, రష్య- అమెరికా వాణిజ్య సంబంధాలపై పుతిన్‌తో ట్రంప్ చర్చించారు.

పుతిన్‌కు ట్రంప్ హెచ్చరిక!

ఇటీవల జెలెన్‌స్కీతో ట్రంప్ మాట్లాడుతూ పుతిన్‌కు చివరి హెచ్చరిక ఇస్తానని పేర్కొన్నారు. ‘పుతిన్ నిజంగా శాంతి చర్చలపై సీరియస్‌గా లేనట్లయితే, అమెరికా టొమాహాక్ దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తుంది’ అని జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రంప్ ఇటీవల ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో జర్నలిస్టులతో మాట్లాడిన సందర్భంలో వెల్లడించారు.

రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ముగింపుకు ట్రంప్ ప్రయత్నాలు ఫలించేనా?

Read hindi news : hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Donald Trump Global Politics International Diplomacy Latest News Breaking News Political Meeting putin news Telugu News Trump news US-Russia relations Vladimir Putin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.