రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine)యుద్ధానికి ముగింపు పలికేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ మేరకు ఆగస్టు 15న అమెరికాలోని అలస్కాలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్,(Trump) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) భేటీ కాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడంపై చర్చలు జరపనున్నారు. ఈ శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాల మార్పిడి ఉంటుందని ట్రంప్ వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆర్మేనియా, అజర్‌బైజాన్ నేతలతో ట్రంప్ భేటీ
శాంతి ఒప్పందం కుదిరితే రష్యాకు కొన్ని ప్రాంతాలు ఇచ్చి, కొన్ని ప్రాంతాలను తిరిగి తీసుకోవాల్సి ఉంటుందన్న కోణంలో ఆయన మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చలు ఇరు వర్గాలకు మెరుగైన ఫలితాలను ఇస్తాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో ఆర్మేనియా, అజర్‌బైజాన్ నేతలను ఆహ్వానించి వారితో ట్రంప్ మాట్లాడారు. ఈ భేటీలో ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారంలో ప్రగతికి భూభాగాల మార్పిడి అవసరమన్న సూచన రావడంతో ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
పుతిన్ ప్రధాన మూడు డిమాండ్లు
శాంతి చర్చల కోసం రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రధాన మూడు డిమాండ్లు పెడుతున్నారు. అందులో ఒకటి: రష్యా ఆక్రమించిన భూభాగాలను ఉక్రెయిన్ విడిచిపెట్టాలి. రెండోది: పాశ్చాత్య దేశాల సైనిక సహాయాన్ని నిలిపివేయాలి. మూడోది: నాటోలో చేరే ప్రయత్నాలు ఉక్రెయిన్ విరమించుకోవాలి. భూభాగాలను రష్యాకు అప్పగించడానికి ఉక్రెయిన్, దాని మిత్రదేశాలు ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించే అవకాశం ఉండదు. అయితే, పుతిన్ మాత్రం ఉక్రెయిన్ కొన్ని భూభాగాలను రష్యాకు అప్పగించాల్సిందేనని నొక్కి చెబుతున్నారు. 2014 నుంచి రష్యా ఆక్రమణలో ఉన్న క్రీమియా, డొనెత్స్క్, లుహాంస్క్, ఖెర్సన్, జపోరిజ్జియా వంటి ప్రాంతాలను ఉక్రెయిన్ ఎప్పటికీ వదులుకోబోమని స్పష్టంగా చెబుతోంది. కానీ పుతిన్ మాత్రం, ఆ ప్రాంతాలు రష్యాకే చెందాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో భూభాగాల మార్పుపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
చట్టపరమైన అడ్డంకి ఉండదు
ట్రంప్- పుతిన్ సమావేశం ఎక్కడ జరుగుతుందన్న దానిపై గత కొన్ని వారాలుగా చర్చ సాగింది. కారణం ఏంటంటే పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) యుద్ధ నేరాల ఆరోపణలతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఐసీసీ సభ్యదేశంలో పుతిన్ అడుగుపెడితే అతన్ని అదుపులోకి తీసుకోవాల్సిన చట్టపరమైన బాధ్యత ఆ దేశానికి ఉంటుంది. అమెరికా ఐసీసీలో సభ్యదేశం కాదు. కాబట్టి అమెరికా భూభాగమైన అలస్కారం పుతిన్ రావడంలో చట్టపరమైన అడ్డంకి ఉండదు. భౌగోళికంగా చూసుకున్న కూడా అలాస్కా అమెరికాకు చెందిన భూభాగం అయిననా రష్యా ప్రధాన భూభాగానికి కేవలం 88 కి.మీ దూరంలో ఉంటుంది. దీంతో వ్యూహాత్మకంగా రష్యా సరిహద్దు నుంచి భౌగోళికంగా సులభంగా చేరుకునే ప్రాంతం అలస్కా.
సమావేశానికి ప్రతిపాదన
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ గత నెల ప్రకటించారు. ఆగస్టు 8 నాటికి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని గడువు విధించారు. ఈ యద్ధాన్ని ఆపడం ద్వారా తనను తాను దూతగా ప్రమోట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ, అనుకున్నది జరగలేదు. ట్రంప్ బెదిరింపులను రష్యా బేఖాతరు చేసింది. శుక్రవారంతో గడువు ముగిసింది. ఈక్రమంలో ట్రంప్ స్వయంగా కలగచేసుకోని తన రాయబారి ద్వారా రష్యా డిమాండ్లను తెలుసుకోని ఈ సమావేశానికి ప్రతిపాదనను పంపినట్లు తెలుస్తోంది.
రష్యాకు అత్యంత మంచి స్నేహితుడు ఎవరు?
ఉక్రెయిన్ దాడి తర్వాత పాశ్చాత్య ప్రపంచంతో సంబంధాలు క్షీణించినప్పటికీ, చైనా, బెలారస్, ఇరాన్, క్యూబా, వెనిజులా, నికరాగ్వా, ఉత్తర కొరియా, మయన్మార్, ఎరిట్రియా, మాలి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, జింబాబ్వే, బుర్కినా ఫాసో, బురుండి, ఇరాక్, ... వంటి కొన్ని దేశాలతో రష్యా ఇప్పటికీ మద్దతు మరియు బలమైన సంబంధాలను కొనసాగిస్తోంది.
అమెరికా మరియు రష్యా ఎందుకు శత్రువులుగా మారాయి?
రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాలు కాకముందే రెండు వర్గాలు శత్రువులుగా ఉన్నాయి. 1917 నుండి రష్యా కమ్యూనిస్టుగా మారడంతో మరియు పశ్చిమ దేశాలు జోక్యం చేసుకుని దానిని ఆపడానికి ప్రయత్నించడంతో సంబంధాలు చెడిపోయాయి. 1920లలో రష్యాను లీగ్ ఆఫ్ నేషన్స్‌లో చేరడానికి కూడా అనుమతించలేదు మరియు 1930లలో పరిస్థితులు మరింత దిగజారాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also :