Iran vs USA: రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

Read Time:  1 min
రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్
రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్
FONT SIZE
GET APP

పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. దాడులు ప్రతిదాడులతో అక్కడ అగ్ని జ్వాలలు రేగుతున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. విమర్శలు ప్రతి విమర్శలతో మాటల యుధ్దం తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఇరాన్ సంచలన వ్యాఖ్యలతో అమెరికాపై విరుచుకుపడింది. అంతర్జాతీయ చమురు దౌత్యంలో అమెరికా ద్వంద్వ వైఖరిపై తీవ్రంగా మండిపడింది. ఒకప్పుడు రష్యా నుంచి చమురు కొనకూడదని ప్రపంచ దేశాలపై ఒత్తిడి చేసిన అమెరికా ఇప్పుడు అదే రష్యా చమురును కొనాలని బతిమాలుకుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి(Syed Abbas Araqchi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శను ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రస్తుతం గణనీయంగా పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి ను ఇరాన్ తాత్కాలికంగా మూసివేయడంతో చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడి, గ్లోబల్ చమురు ధర ప్రతి బ్యారెల్ 100 డాలర్లు దాటింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అమెరికా ప్రభుత్వం, రష్యా చమురును సముద్రంలో కొనుగోలు చేయడానికి 30 రోజుల స్పెషల్ మినహాయింపులు జారీ చేసింది.

Today bank open or not: నేడు బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?

Iran vs USA: Trump pressured to buy Russian oil.. Iran lashed out at America
Iran vs USA: Trump pressured to buy Russian oil.. Iran lashed out at America

ఈ మినహాయింపు ఏప్రిల్ 11 వరకు వర్తించనుంది

ఈ మినహాయింపు ఏప్రిల్ 11 వరకు వర్తించనుంది అని యుఎస్ ట్రెజరీ విభాగం వెల్లడించింది. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పాకిస్తాన్ పరిస్థితి.. ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక విలవిల.. అయితే, ఇరాన్ యుద్ధ వాతావరణంలో కూడా భారత్‌తో తమ స్నేహ బంధాలను కొనసాగిస్తోంది. భారత్‌కు వచ్చే రెండు ఎల్‌పీజీ గ్యాస్ నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటేందుకు అనుమతించాయి. ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ ప్రకారం..భారత్, ఇరాన్ మిత్ర దేశాలు. మాకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. భారత నౌకలకు ఎల్లప్పుడూ సురక్షిత మార్గం ఉంటుందని హామీ ఇస్తున్నామని తెలిపారు. ఇరాన్- భారత్ మధ్య ఉన్న వాణిజ్య, ఎనర్జీ సంబంధాలు ఇప్పటికే decades‌ నాటి మిత్రత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. చమురు, గ్యాస్ సరఫరా, ఇంధన భద్రతా అవసరాల పరంగా రెండు దేశాలు సమన్వయం చేస్తున్నారు. తాజాగా హర్మూజ్ మార్గాన్ని సురక్షితంగా ఉంచడం ద్వారా.. ఇరాన్, భారత్ భద్రతా, వ్యాపార మౌలిక సదుపాయాల పరంగా సహకారం పెంచడం గమనించదగిన విషయం. ఈ పరిణామాలు చమురు మార్కెట్‌ను స్థిరీకరించడంలో కీలకంగా ఉంటాయి. రష్యా చమురు కొనుగోలు కోసం అమెరికా ఇచ్చిన మినహాయింపులు, గ్లోబల్ చమురు సరఫరా వ్యవస్థపై కూడా ప్రభావం చూపనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.