వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరగడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. తమ దేశంలోకి వలసలు గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. పేద దేశాల (థర్డ్ వరల్డ్ దేశాలు) నుంచి అగ్రరాజ్యానికి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని తెలిపారు. తద్వారా అమెరికాలోని అక్రమ ప్రవేశాలను అడ్డుకోవడానికి వీలు కల్పిస్తామని అన్నారు. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పుల ఘటన నేపథ్యంలో ట్రంప్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Read Also: USA: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. గ్రీన్ కార్డ్ వారిపై ఫోకస్
గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పై సమీక్ష కాల్పులు
18దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పై సమీక్ష కాల్పులు అంతేకాక అఫ్గాన్ తో సహా మరో 18దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను (Green card holders) సమీక్షించనున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో ప్రకటించారు. కాగా వైట్ హౌస్ సమీపంలో చేసిన నిందితుడు అఫ్ఘానిస్థాన్ కు చెందిన రెహ్మనుల్లా లఖన్ వాల్ అని లా ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు వెల్లడించారు.
2021లో అఫ్గానిస్థానీయులకు ఇచ్చిన స్పెషల్ వీసాపై అమెరికాకు వచ్చినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో నిందితుడికి గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించామని.. అయితే అతడు ఒక్కడే ఈ దాడికి పాల్పడ్డట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: