Trump Venezuela blockade : వెనిజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఆంక్షలు విధించిన వెనిజువెలా చమురు ట్యాంకర్ల రాకపోకలపై “పూర్తి నౌకా దిగ్బంధం” (Naval Blockade) అమలు చేయాలని ఆదేశించారు. వెనిజువెలా తీరానికి సమీపంలో గత వారం ఒక చమురు ట్యాంకర్‌ను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, “దక్షిణ అమెరికా చరిత్రలోనే అతి పెద్ద నౌకాదళంతో వెనిజువెలాను పూర్తిగా చుట్టుముట్టాం” అని పేర్కొన్నారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి కారణాలతో వెనిజువెలా ప్రభుత్వాన్ని ‘విదేశీ ఉగ్రవాద సంస్థ’గా గుర్తించినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అందుకే వెనిజువెలాకు వచ్చే, వెళ్లే అన్ని ఆంక్షల కింద ఉన్న చమురు ట్యాంకర్లపై సంపూర్ణ దిగ్బంధం విధిస్తున్నామని చెప్పారు.
IPL Mini Auction: పృథ్వీ షాకు ఊరట, తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి
ఈ ప్రకటనపై వెనిజువెలా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. (Trump Venezuela blockade) ట్రంప్ నిర్ణయాన్ని “అసంబద్ధమైన, దౌర్జన్యపూరిత బెదిరింపు”గా అభివర్ణించింది. తమ దేశ సంపదను దోచుకునే ఉద్దేశంతోనే అమెరికా ఈ నౌకా దిగ్బంధం విధిస్తోందని ఆరోపించింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది.
ఇదిలా ఉండగా, వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడూరో కూడా స్పందిస్తూ, చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడం సముద్ర దొంగతనానికి సమానమని వ్యాఖ్యానించారు. ఈ చర్యలకు ప్రపంచ దేశాలు వ్యతిరేకంగా నిలబడతాయని అన్నారు. మరోవైపు, అమెరికా డెమోక్రాట్ ఎంపీ జోక్విన్ కాస్ట్రో ట్రంప్ నిర్ణయాన్ని “యుద్ధ చర్యతో సమానం” అని విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: