అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తన కేబినెట్‌లో కీలకమైన ఇంటీరియర్ సెక్రటరీ పదవికి డగ్ బర్గమ్(Doug Burgum)ను ఎంపిక చేయడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ముఖ్యంగా బర్గమ్ భార్య క్యాథరిన్ చాలా అందంగా ఉండటం వల్లే ఆయనకు ఈ పదవి దక్కిందంటూ ట్రంప్ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారాయి.
Read Also: Cancer Atlas : క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు
క్యాథరిన్ చాలా ఆకర్షణీయంగా కనిపించారు: ట్రంప్
మాదకద్రవ్యాల కట్టడికి సంబంధించిన ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన అనంతరం.. ఓవల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో డగ్ బర్గమ్, ఆయన భార్య క్యాథరిన్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. “ఒకసారి డగ్, క్యాథరిన్ ఇద్దరూ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను చూశాను. అందులో క్యాథరిన్ చాలా ఆకర్షణీయంగా కనిపించారు. ఆమె ఎవరని నా సిబ్బందిని ఆరా తీశాను. ఆ జంట గురించి తెలుసుకున్న తర్వాతే డగ్‌కు పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను” అని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. డగ్ బర్గమ్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాకుండా నార్త్ డకోటాకు రెండు సార్లు గవర్నర్‌గా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అయితే ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని పక్కన పెట్టి.. కేవలం ఆయన భార్య అందాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: