అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్(Trump) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలతో వైరం కొనితెచ్చుకుంటున్నారు. తన మాటే వేదం.. లేదంటే అధిక టారిఫ్ లు తప్పవంటూ బెదిరిస్తూ వచ్చారు ఇంతకాలం. వసలవాదులపై ఉక్కుపాదం మోపారు.
ప్రత్యేకంగా భారతీయులే లక్ష్యంగా పెట్టుకుని కఠిన వీసా(Visa) నిబంధనల్ని తీసుకొచ్చారు. భారత్ వల్లే రష్యా-ఉక్రెయిన్ దేశాలమధ్య యుద్ధం ఆగిపోవడం లేదని అభాండాలు వేశారు. కక్షసాధింపుగా 25 శాతం నుంచి 50శాతానికి సుంకాలను పెంచారు.
అయినా భారత్(India) వీటిపై ఏమాత్రం భయపడలేదు. అమెరికాకు దూరం అవుతూ వచ్చింది. చైనా, రష్యాలతో స్నేహసంబంధాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నది. అయితే తాజాగా ట్రంప్ ఆ ఆసక్తికర పోస్టు చేశారు.
అమెరికాకు భారత్ దూరం కావడం బాధాకరమని ట్రంప్(Trump) ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సి సమావేశం అనంతరం మోదీ, జిన్ పింగ్, పుతిన్ ఉన్న ఫోటోను ట్రంప్ సోషల్ మీడియాలో ట్రూత్ లో పోస్ట్ చేశారు.
ఈ రెండు దేశాలు కుట్ర బుద్ధ ఉన్న చైనాకు దగ్గరయ్యాయి. మూడు దేశాల స్నేహం చాలాకాలం కొనసాగవచ్చు’ అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read hindi news: Hindi.vaartha.com
Read Also: