అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మరోసారి ప్రభుత్వ ఉద్యోగాలపై ఉక్కుపాదం మోపడం స్టార్ట్ చేసాడు. తాజాగా విదేశాంగ శాఖలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైనట్టు సమాచారం. ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని చర్యలు చేపడుతోందని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
1300 మందికి తొలగింపు నోటీసులు
ఈ తొలగింపు ప్రక్రియలో భాగంగా మొత్తం 1300 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం ప్రారంభమైందని సమాచారం. వీరిలో 1107 మంది సివిల్ సర్వెంట్లు కాగా, మిగిలిన 246 మంది స్థానిక దౌత్య వేత్తలుగా ఉన్నారు. వారందరికీ 120 రోజుల సెలవులు ఇవ్వనున్నారు. ఈ సెలవు గడువు తర్వాత అధికారికంగా ఉద్యోగాల నుంచి తొలగింపునకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ వ్యవస్థలో ఊహించని మార్పులు
ఈ చర్యలతో అమెరికా విదేశాంగ వ్యవస్థలో భయానకత వాతావరణం ఏర్పడుతోంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులు భవిష్యత్‌పై ఆందోళనకు లోనవుతున్నారు. ట్రంప్ పాలనలో మళ్లీ అలాంటి పాలనా శైలి తిరిగొస్తుందనే భావనతో ప్రభుత్వ శాఖల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగాల భద్రతపై ప్రభావం పడుతుందనే ఆందోళన మరింత పెరుగుతోంది.
Read Also : Myanmar : మయన్మార్ లో వైమానిక దాడిలో 23 మంది మృతి