📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Trump : భారత్ కు భారీ ఊరట.. సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్

Author Icon By Sai Kiran
Updated: August 16, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాకు (Trump) రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ట్రంప్ (Trump) ప్రపంచదేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఫస్ట్ తన దేశ ప్రజలు తర్వాతే ఇతర దేశస్తులు అంటూ విదేశీ విధానంపై కఠిన చర్యలను తీసుకుంటున్నారు. వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపడమే కాక వీసాపై పలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుని వారి దేశాలపై పంపిన వైనం తెలిసిందే. ఇక సుంకాలపై అధిక మొత్తాలను విధిస్తూ, ప్రపంచ దేశాలమధ్య వాణిజ్య యుద్ధాలకు తెరతీస్తున్నారు. రష్యా నుంచి చమురు అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నదని కోపించిన ట్రంప్ భారత్ (India) పై 50శాతం సుంకాలను విధించింది. అయితే నిన్న అలాస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ జరిపిన చర్చలు అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోసారి పునఃపరిశీలిస్తాం: ట్రంప్


రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఇప్పుడు కొత్త సుంకాలు విధించడాన్ని తాను పరిగణించాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు. మరో రెండు లేదా మూడువారాల్లో ఈ అంశాన్ని పునఃపరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచ దేశాలకు కాస్త ఊరటనిచ్చింది. భారత్ పై అదనపు సుంకాలు.. రష్యాతో చర్చలు ఈరోజు జరిగిన సమావేశంలో టారీఫ్ ల విషయం తాను కాస్త పక్కన పెట్టానని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ పాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బహుశా రెండు లేదా మూడు వారాల్లో సుంకాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది.. కానీ ప్రస్తుతం మనం దాని గురించి
ఆలోచించాల్సిన అవసరం లేదు అని అన్నారు. భారత్ పై తాను విధించిన అదనపు సుంకాల వల్లనే రష్యాతో సమావేశం జరిగేలా ప్రేరేపించిందని చెప్పారు. తాను సంకాలను విధించినందు వల్ల భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాల్సి వచ్చిందని.. అది ఆ దేశంపై ఒత్తిడి తీసుకువచ్చిందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా అతిపెద్ద వినియోగదారుడని.. చైనాకు చాలా దగ్గరలో ఉందని అన్నారు. అయితే భారత్ ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా
స్పందించింది. ట్రంప్ బెదిరింపులకు తాము లొంగలేదని, రష్యానుంచి చమురు కొనుగోలును ఆపేయలేదని భారత్ చెప్పిన విషయం తెలిసిందే.

భారతదేశంపై ప్రస్తుత సుంకం ఎంత?

బుధవారం, డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై అమెరికా సుంకాలను 25% నుండి 50%కి రెట్టింపు చేశారు, రష్యన్ చమురు కొనుగోలు చేసినందుకు ఢిల్లీని శిక్షించారు – ఈ చర్యను భారతదేశం “అన్యాయం” మరియు “అన్యాయం” అని పిలిచింది. రష్యా చమురు ఆదాయాలను తగ్గించడం మరియు పుతిన్‌ను కాల్పుల విరమణకు బలవంతం చేయడం ఈ సుంకాల లక్ష్యం. కొత్త రేటు 21 రోజుల్లో అమల్లోకి వస్తుంది, అంటే ఆగస్టు 27న.

భారతదేశం నుండి అమెరికాకు సుంకం ఉందా?

భారతీయ వస్తువులపై అమెరికా అదనంగా 25% సుంకం విధిస్తుందని, కొన్ని వస్తువులపై 50% వరకు దిగుమతి సుంకాలు విధిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Read also :

https://vaartha.com/rajinikanth-prime-minister-modi-congratulates-rajinikanth-on-completing-50-years/cinema/530970/

Breaking News in Telugu Google News in Telugu India Trump trade news Latest News in Telugu Telugu News Today Trump India Tariff US India trade relief

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.