📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump Tariffs: చైనా, కెనడా, మెక్సికోలపై ట్రంప్ టారిఫ్

Author Icon By Vanipushpa
Updated: July 15, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వివిధ దేశాలపై టారిఫ్‌(Tariffs)లు విధించిన విషయం తెలిసిందే. అయితే చైనా, కెనడా, మెక్సికో(China, Canada, Mexico)లపై టారిఫ్‌లు విధించడం వల్ల భారత్‌కు కలిసి వస్తుందని ఇటీవల ‘ట్రేడ్‌ వాచ్‌ క్వార్టర్లీ’ ఓ నివేదికలో తెలిపింది. అమెరికా దిగుమతుల్లో 30 విభాగాలు ఉండగా అందులో 22 విభాగాల్లో భారత్‌కు ప్రయోజనం లభిస్తుంది. అమెరికా చైనాపై 30%, కెనడాపై 35%, మెక్సికోపై 25% టారిఫ్‌లు విధించింది.

Trump Tariffs: చైనా, కెనడా, మెక్సికోలపై ట్రంప్ టారిఫ్

భారత్ మార్కెట్ పైకి..
వీటివల్ల భారత్‌కు టారిఫ్ ప్రయోజనం లభిస్తుంది. ఈ టారిఫ్‌ల వల్ల అమెరికాలో భారత్ తన మార్కెట్ విలువను పెంచుకోవచ్చు. ఫార్మా, జౌళి, విద్యుత్ మెషినరీ వంటి రంగాల్లో వృద్ధి ఎక్కువగా ఉంటుందట. మరో ఆరు విభాగాల్లో కూడా భారత్‌కు పోటీ విషయంలో ఎలాంటి మార్పు కూడా ఉండదు. ఈ టారిఫ్‌ల వల్ల ఖనిజాలు, ఇంధనాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, సముద్ర ఉత్పత్తులు వంటి వస్తువులకు లాభం చేకూరనుంది. దాదాపుగా 1,265 బిలియన్ డాలర్ల మార్కెట్‌లో భారత్‌కు ప్రాఫిట్ వస్తుంది.

అమెరికాతో సేవల ఆధారిత వాణిజ్య ఒప్పందం

భారత్ కూడా అమెరికాతో సేవల ఆధారిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నీతిఆయోగ్ తెలిపింది. ఐటీ, ఆర్థిక సేవలు, వృత్తిపరమైన సేవలు, విద్య వంటి రంగాలపై దృష్టి పెట్టాలని పేర్కొంది. ముఖ్యంగా హెచ్-1బీ, ఎల్-1 వీసా ప్రక్రియలను మెరుగుపరచడంపై చర్చించాలని సూచించింది. అయితే ప్రస్తుతం భారత వాణిజ్య మంత్రిత్వ బృందం వాషింగ్టన్‌లో ఉంది. వ్యవసాయం, వాహన రంగాల్లో ఇరు దేశాలు సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. అమెరికా భారత్‌పై 10 శాతం టారిఫ్ విధించినా కూడా భారత్ తన ఎగుమతులను పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Syria clashes: సిరియాలో కొనసాగుతున్న మారణహోమం

#telugu News Canada Trade China trade economic policy global tariffs import duties Mexico trade Trade War Trump news Trump tariffs US international trade

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.