📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Trump: కెనడాపై ట్రంప్ భారీ సుంకాలు

Author Icon By Vanipushpa
Updated: July 11, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పొరుగు దేశం కెనడా(Canada)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) భారీ సుంకాన్ని(Tariff) విధించారు. కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Canada PM Mark Carney)కి లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలియదేశారు. అలాగే, ఆ లేఖను ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో కూడా షేర్ చేసారు. ట్రంప్ ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత కెనడా డాలర్ విలువ 0.4శాతం పడిపోయింది, అలాగే, ఎస్అండ్ పీ ఫ్యూచర్ స్టాక్స్ 0.5శాతం తగ్గాయి.

ఫెంటనిల్ పై ట్రంప్ ఆరోపణ
అమెరికాలోకి ఫెంటనిల్ మత్తు పదార్థాలు అక్రమ రవాణా కెనడా ద్వారా ఎక్కువగా జరుగుతోందని, దీనిని కట్టడి చేయడంలో కెనడా విఫలమైందని అందుకే, అమెరికా 35 శాతం టారిఫ్ విధించాలని నిర్ణయించినట్లు ట్రంప్ ఆ లేఖలో పేర్కొన్నారు. 2025 ఆగస్టు 1నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వస్తుందని చెప్పారు. ఒకవేళ కెనడా కూడా అమెరికా వస్తువులపై టారిఫ్‌లు పెంచితే తమ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అమెరికా మరింతగా టారిఫ్ రేట్లను పెంచుతుందన్నారు. ప్రత్యేకించి, fఅమెరికా డెయిరీ ఉత్పత్తులపై కెనడా 400 శాతం వరకు అధిక టారిఫ్ వసూలు చేస్తుందని ట్రంప్ లేఖలో ఆరోపించారు. ఈ వాణిజ్య లోటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నదని పేర్కొన్నారు.

Trump: కెనడాపై ట్రంప్ భారీ సుంకాలు

బ్రెజిల్ దిగుమతులపై అత్యధికంగా 50శాతం టారిఫ్
ట్రంప్ ఇప్పటికే పలు దేశాలపై భారీ సుంకాలను విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఆయా దేశాలకు లేఖలు కూడా శారు. బ్రెజిల్ దిగుమతులపై అత్యధికంగా 50శాతం టారిఫ్​ను విధిస్తామని చెప్పారు. ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన టారీఫ్​లలో ఇదే అత్యధికం. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై నడుస్తున్న కేసును అమెరికా తప్పుబట్టింది.

పలు దేశాలపై టారిఫ్​లను ట్రంప్

అలాగే, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, కజాకిస్థాన్, దక్షిణాఫ్రికా, మయన్మార్, లావోస్, థాయిలాండ్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ట్యునీషియా, బోస్నియా, హర్జెగొవినా, సెర్బియా, కంబోడియా, శ్రీలంక, అల్జీరియా, ఇరాక్, లిబియా, మోల్డోవా, బ్రునై, ఫిలిప్పీన్స్‌ సహా పలు దేశాలపై టారిఫ్​లను ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలపై విధించనున్న సుంకాలను ట్రంప్ ప్రకటించించనున్నారు. ఆగస్టు 1నుంచి పెంచిన సుంకాలు అమల్లోకి రానున్నాయి. ట్రంప్ నిర్ణయంతో కెనడాలోని ఇండస్ట్రీలు ఇతర మార్కెట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. యూకే, ఈయూ, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలకు తమ మార్కెట్ విస్తిరించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, టారిఫ్ లు పెంచిన నేపథ్యంలో అమెరికాతో చర్చించాలని కెనడా భావిస్తోంది .

ట్రంప్‌లో సుంకాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
ఏప్రిల్ 2న, అతను "విముక్తి దినోత్సవం" అని పిలిచే రోజున, ట్రంప్ జాతీయ వాణిజ్య లోటుకు సంబంధించి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు మరియు ఇతర ఆంక్షలకు లోబడి లేని అన్ని దేశాలపై "పరస్పర సుంకాలు" ప్రకటించాడు. దాదాపు అన్ని US దిగుమతులపై 10% ప్రాథమిక సుంకం ఏప్రిల్ 5 నుండి అమల్లోకి వచ్చింది.
చైనాతో ట్రంప్ వాణిజ్య యుద్ధం ఏమిటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సుంకాలు మరియు ఇతర వాణిజ్య అడ్డంకులను విధించడం ప్రారంభించినప్పటి నుండి, చైనా మరియు అమెరికా మధ్య ఆర్థిక వివాదం కొనసాగుతోంది, అమెరికా దీర్ఘకాలంగా ఉన్న అన్యాయమైన వాణిజ్య పద్ధతులు మరియు మేధో సంపత్తి అని అమెరికా చెప్పిన దానికి మార్పులు చేయమని బలవంతం చేసే లక్ష్యంతో ...

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: మూడో టెస్ట్‌లో కుల్దీప్ యాదవ్‌కు దక్కని అవకాశం

#telugu News Canada Exports Heavy Tariffs Latest News Breaking News North America Trade Trump Canada Tariffs Trump Economic Measures Trump trade policy US Canada Trade US import duties

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.