అమెరికా– కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల ఆయుధాన్ని ఎత్తి చూపుతూ కెనడా(Canada)పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోకి దిగుమతయ్యే కెనడాకు చెందిన అన్ని విమానాలపై 50 శాతం సుంకాలు విధిస్తానని స్పష్టం చేశారు. జార్జియాలోని సవన్నా కేంద్రంగా పనిచేస్తున్న అమెరికా విమాన తయారీ సంస్థ గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ జెట్లకు కెనడా సర్టిఫికేషన్ ఇవ్వడంలో నిరాకరించడమే దీనికి కారణమని ట్రంప్ ఆరోపించారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ, “కెనడా గల్ఫ్‌స్ట్రీమ్ ఉత్పత్తులను అమ్మకుండా అడ్డుకుంటోంది. వెంటనే ఈ పరిస్థితిని సరిచేయకపోతే కెనడా విమానాలన్నింటిపైనా 50% టారిఫ్ విధిస్తాం” అని హెచ్చరించారు. కెనడాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బాంబార్డియర్ తయారు చేసే గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ బిజినెస్ జెట్లపై కూడా ఇదే సుంకాలు వర్తిస్తాయని తెలిపారు. అంతేకాదు, కెనడాలో తయారయ్యే అన్ని విమానాల ధృవీకరణను రద్దు చేసే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు
రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు
ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటీవల కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ట్రంప్‌కు ఉన్న విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. కెనడా చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే అమెరికాకు వచ్చే కెనడియన్ వస్తువులపై 100 శాతం సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. “కెనడా చైనాకు డ్రాప్ ఆఫ్ పోర్ట్ అవుతుందని భావిస్తే పొరపాటే” అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. చైనా కెనడా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మింగేస్తుందని కూడా ఆరోపించారు. ఇదిలా ఉండగా, కెనడా ప్రధాని కార్నీ మాత్రం “కెనడా సార్వభౌమాధికారాన్ని అమెరికా గౌరవించాలి” అంటూ ట్రంప్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. బీజింగ్ పర్యటనలో చైనాతో ఆర్థిక సహకారంపై చర్చలు జరిపిన కార్నీ, అమెరికాతో ఉన్న అనిశ్చితి కంటే చైనాతో సంబంధాలు స్థిరంగా ఉంటాయని వ్యాఖ్యానించడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: