📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Trump: ఎనిమిది యుద్ధాలను ఆపిన ఘనత నాదే.. నోబెల్ బహుమతికీ అర్హుడినే

Author Icon By Sushmitha
Updated: December 3, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడి నోట మళ్లీ.. మళ్లీ అదే పాట భారత్-పాకిస్థాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ పాత పాటే పాడారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఎనిమిది యుద్ధాలను ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) రావాలని పునరుద్ఘాటించారు. మరో యుద్ధాన్ని కూడా ముగించేందుకు చేరువలో ఉన్నాని తెలిపారు.

Read Also: GAZA: గాజాలో సామూహిక వివాహాలు.. ఒక్కటైన 54జంటలు

మంగళవారం క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్-పాకిస్తాన్ లమధ్య యుద్ధం విరమణలో ట్రంప్ పాత్ర ఏమీ లేదని, ఇందులో మూడోవ్యక్తి ప్రమేయం లేకుండానే రెండు దేశాలు కాల్పుల ఒప్పందానికి వచ్చినట్లుగా భారత్ పలుమార్లు వివరణ ఇచ్చింది. అయినా కూడా ట్రంప్ తన ధోరణిని మార్చుకోవడం లేదు.

Trump I am credited with stopping eight wars.. I deserve a Nobel Prize.

ప్రతి యుద్ధానికి నాకు నోబెల్ రావాలి

“నేను ఎనిమిది యుద్ధాలను ముగించాం. కానీ ఇంకో ఒకటి ఉంది. అదే రష్యా – ఉక్రెయిన్. దాన్ని కూడా ముగించాలని చూస్తున్నాం. నేను యుద్ధాన్ని ముగిస్తా. ప్రతిసారీ వారు నాకు నోబెల్ బహుమతి వస్తుందని అంటారు. కానీ తర్వాత దీనికి కాదు ఇంకొకదానికి వస్తుంది అని చెబుతారు. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించినట్లయితే నోబెల్ వస్తుంది అని అంటారు. మరి మిగతా ఎనిమిది యుద్ధాల సంగతేంటి? భారత్, పాక్ తో సహా నేను అన్ని యుద్ధాలు గురించి ఆలోచించండి.

ప్రతి యుద్ధానికి నాకు నోబెల్ రావాలి. కానీ నేను ఆశపడను. ఈ యుద్ధాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న ప్రజలను కాపాడటమే ముఖ్యం. అలాగే 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా కూడా నాకు నోబెల్ రావాలని చెప్పింది’ అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇప్పటివరకు 60 సార్లకుపైగా చెప్పిన ట్రంప్

ఈ ఏడాది ఏప్రిల్ లో పహల్గాంలో అమాయక పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26మంది మరణించారు. దీంతో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ క్రమంలో వందలాది మంది ముష్కరులు హతమయ్యారు. దీంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ పై పాక్ వైమానిక దాడుల యత్నించగా, ఇండియా సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది.

కరాచీ పోర్టు, సైనిక స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసి దాయాది దేశాన్ని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఈ క్రమంలో మే 10న ఇరుదేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఒ)ల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పలు వేదికలపై ఇప్పటివరకు 60 సార్లకుపైగా చెప్పారు. భారత్, పాకిస్తాన్ ను 350 శాతం సుంకాలతో బెదిరించి, రెండు అణుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని తెలిపారు. తాము యుద్ధానికి వెళ్లబోవడం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తనకు ఫోన్ చేశారనని చెప్పారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

America ForeignPolicy Google News in Telugu Latest News in Telugu Narendra Modi NobelPrizeClaim Peacemaker PoliticalStatements StoppedWars Telugu News Today trump USPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.