📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News:Trump-హెచ్-1బీ వీసా ఫీజు పెంపు.. భారతీయుల్లో టెన్షన్

Author Icon By Pooja
Updated: September 20, 2025 • 2:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్ల(రూ.88లక్షలు) కు పెంచడంతో అక్కడ నివసిస్తున్న భారతీయుల నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది. ట్రంప్ నిర్ణయం వల్ల అప్పుడే భారతీయుల్లో ఆందోళన మొదలైంది. మైక్రోస్టాఫ్, అమెజాన్, టీసీఎస్, ఆపిల్ వంటి టెక్ దిగ్గజాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. హెచ్ 1బీ వీసా దరఖాస్తులలో 70శాతానికి పైగానే భారతీయులే ఉండడం గమనార్హం. ఈ కంపెనీలు తమ వ్యాపార అవసరాల కోసం, ముఖ్యంగా భారత్ వంటి దేశాల నటుండి అధిక సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి హెచ్ 1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడతాయి. ఈ కొత్త నిబంధనల వల్ల ఈ కంపెనీలు భారీగా ఆర్థిక భారాన్ని(Financial burden) మోయాల్సి వస్తుంది.

హెచ్ 1బీ వీసా ఫీజును కంపెనీలే భరిస్తాయి

సాధారణంగా హెచ్ 1బీ వీసా ఫీజును కంపెనీలే భరిస్తాయి. ఇప్పటివరకు ఈ ఖర్చు కొన్నివేల డాలర్లలో ఉండేది. అయితే ఇప్పుడు ప్రతి ఉద్యోగికి లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి వస్తే, ఈ కంపెనీల నియామక ఖర్చులు ఆకాశాన్నంటుతాయి. అమెజాన్, మైక్రోసాఫ్ వంటి కంపెనీలు ఏటా వేలసంఖ్యలో హెచ్ 1బీ వీసాలను స్పాన్సర్ చేస్తాయి. ఈ భారీ పెంపుదల వల్ల ఆయా కంపెనీలు ఏటా వందల కోట్ల డాలర్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది వారి లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

అమెరికన్ ఉద్యోగుల పరిరక్షణ కోసమే ఇదంతా..

ట్రంప్ ప్రభుత్వం ఈ మార్పులు తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశం అమెరికన్ ఉద్యోగాలను పరిరక్షించడం. హెచ్ 1బీ వీసా ప్రోగ్రాము దుర్వినియోగం చేస్తూ తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను(Foreign employees) నియమించుకుంటున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కొత్త ఫీజు వల్ల కంపెనీలు అమెరికన్లను నియమించుకోవడం వైపు మొగ్గ చూపుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయ ఐటీ నిపుణులలో, విద్యార్థులలో, కంపెనీలలో తీవ్ర ఆందోళన కలుగుతున్నది. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే యోచనలో కంపెనీలు ఉన్నాయి. ఈ అధిక ఫీజు వల్ల కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి వెనకడుగు వేయవచ్చు.

దీంతో భారతీయు ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగావకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు ట్రంప్ రోజుకో విధానం వల్ల తలలు పట్టుకుంటున్నారు. ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకునివస్తుందో తెలియక అయోమయస్థితి ఉన్నారు. క్రమంగా తమ డాలర్ కలలు కరిగిపోతున్నాయని వాపోతున్నారు.

కొత్త ఫీజు ఎంత పెరిగింది?
ఫీజు పెంపు రకం మరియు వీసా కేటగిరీ ఆధారంగా ఉంటుంది; మొత్తం పెరుగుదల వివరాలు USCIS అధికారిక వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

భారతీయులు ఎలా ప్రభావితమవుతారు?
అమెరికాలో పని చేయాలనుకునే H-1B వీసా అభ్యర్థులు అధిక ఖర్చులు చెల్లించాల్సి వస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/road-safety-cess-criticism-of-the-incumbent-government/breaking-news/550902/

Google News in Telugu H1BVisa IndianITProfessionals Latest News in Telugu Telugu News Today trump USVisaPolicy VisaFeeHike

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.