📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Greetings-మోదీకి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్ 

Author Icon By Pooja
Updated: September 17, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేడు ప్రధాని నరేంద్రమోదీ 75వ జన్మదినోత్స వాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి నెలకొల్పడానికి తాను చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ మద్దతు తెలిపారని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యుద్ధం ముగియడానికి పూర్తి మద్దతు ఇస్తానని మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ తెలిపారు.

నా మిత్రుడితో అద్భుత సంభాషణ

డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్”(Truth Social)‘ ఖాతాలో ట్రంప్ ఈ విషయం వెల్లడించారు. ‘నా మిత్రుడు, ప్రధాన నరేంద్ర మోదీతో అద్భుతమైన ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మోదీ బాగా పని చేస్తున్నారని ట్రంప్ప్ర శంసించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు!’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.

ధన్యవాదాలు తెలిపిన మోదీ

ట్రంప్ ఫోన్ చేసి, తనకు బర్త్ డే విషెస్ (Birthday Wishes)చెప్పినట్లు మోదీ కూడా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ కూడా ఈ ఫోన్ కాల్పై స్పందిస్తూ, ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు, నా మిత్రమా అని మోదీ పేర్కొన్నారు. మీలాగే, నేను కూడా భారత్-అమెరికా సమగ్ర, ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలను తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ సంఘర్షణకు శాంతియుత పరిష్కారం దిశగా మీ ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తున్నాం’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు మోదీ.

టారీఫ్ ఉద్రిక్తతల వేళ.. సానుకూల చర్చలు

ఇరుదేశాల మధ్య గతకొన్ని రోజులుగా టారీఫ్ విషయంలో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కాల్, ఇటీవల ఇరు దేశాలమధ్య జరిగిన వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగిసిన నేపథ్యంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. గతంలో అమెరికా విధించిన సుంకాలు, రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాలమధ్య కొంతకాలంగా నెలకొన్ని ఉద్రిక్తతలను ఈ పరిణామం తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఇరుదేశాల నాయకుల మధ్య ఈ విధమైన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలలో మరింత బలమైన బంధానికి సూచికగా నిలుస్తున్నాయి. ఏదేఏమైనా ఇటీవల మోదీ చైనా పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో సమావేశమైన సందర్భంగా

ట్రంప్ వీరి సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలో భాగమే ఈ సమావేశమని అన్నారు. రష్యా చమురు విషయంలో భారత్-అమెరికాల మధ్య కాస్త ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ట్రంప్ మోదీకి ఫోన్ చేసి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫోన్ సంభాషణలు జరగడంతో మళ్లీ రెండుదేశాల మధ్య పూర్వస్నేహసంబంధాలు కొనసాగవచ్చేనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

మోదీ-ట్రంప్ సంబంధాలు ఎలా ఉన్నాయి?
మోదీ మరియు ట్రంప్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. వారు పలు అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారం చూపారు.

ట్రంప్ వ్యాఖ్యలు ఏ విధంగా స్వీకరించబడ్డాయి?
ట్రంప్ చేసిన శుభాకాంక్షలు భారతీయ ప్రజలు మరియు రాజకీయ వర్గాల ద్వారా సానుకూలంగా స్వీకరించబడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/atchannaidu-jagans-crocodile-tears-for-farmers/andhra-pradesh/548734/

Donald Trump Latest Google News in Telugu India US relations Latest News in Telugu Modi Trump relations Narendra Modi News Telugu News Today Trump Wishes Modi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.