గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణ ‘అత్యవసరం’ అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అంటున్నారు. అది జరగకపోతే రష్యా, చైనా కలిసి ‘గ్రీన్‌లాండ్ (Greenland)ను ఆక్రమించుకుంటాయి’ అనేది ఆయన వాదన. “అక్కడ రష్యా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు ఉన్నాయి. చైనా యుద్ధ విమానాలను కూడా మోహరించారు” అని ట్రంప్ ఇటీవల అన్నారు. డెన్మార్క్ పాక్షిక స్వయంప్రతిపత్తి ప్రాంతం(సెమీ అటానమస్ టెరిటరీ) గ్రీన్‌లాండ్. ట్రంప్ గ్రీన్‌లాండ్ ప్రణాళికను డెన్మార్క్, దాని మిత్రదేశాలు వ్యతిరేకించాయి. దీనికి ప్రతిస్పందనగా జనవరి 17న ట్రంప్ మాట్లాడుతూ.. డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, బ్రిటన్‌లు తన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తే కనుక ఆ ఎనిమిది మిత్రదేశాలపై ఫిబ్రవరిలో కొత్త సుంకాలను విధిస్తానని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌ను రష్యా, చైనా కలిసి ఆక్రమిస్తాయనే భయాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. దాంతో గ్రీన్‌లాండ్‌కు సంబంధించి ట్రంప్ నిర్ణయం ఆ రెండు దేశాలలో ఆగ్రహాన్ని కలిగించే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు.
Read Also: JD Vance : నాలుగోసారి తండ్రి కాబోతున్న JD వాన్స్
రష్యన్ వార్తాపత్రిక రోసిస్కాయా గెజిటా ఏమని రాసింది?
“అమెరికా అధ్యక్షుడు చరిత్రాత్మక విజయం సాధించడానికి డెన్మార్క్ మొండితనం, అమెరికా స్నేహితులుగా భావిస్తున్న బ్రిటన్, ఫ్రాన్స్ సహా తిరుగుబాటు యూరోపియన్ దేశాల నకిలీ ఐక్యత అడ్డంకిగా ఉన్నాయి” అని రష్యన్ వార్తాపత్రిక రోసిస్కాయా గెజిటా రాసింది. “2026 జూలై 4న అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. అప్పటికి ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటే, అమెరికా గొప్పతనాన్ని స్థాపించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు, ట్రంప్ కారణంగా గ్రీన్‌లాండ్ అమెరికాలో భాగమైతే, అమెరికా ప్రజలు ఆ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు” అని ఆ పత్రిక రాసింది.
దీనిపై చైనా స్పందనేంటి?
గ్రీన్‌లాండ్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బెదిరింపులపై చైనా స్పందించింది. తన సొంత ప్రయోజనాలకోసం “చైనా ముప్పు” అంటూ సాకులు చెప్పడం ఆపాలని ఆమెరికాను తమ దేశం కోరినట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ సోమవారం తెలిపారు. “ట్రంప్ గ్రీన్‌లాండ్ ప్రణాళిక, ఆయన వ్యాఖ్యలపై చైనా మీడియాలో రెండు విషయాలు హైలైట్ అవుతున్నాయి. జనవరి 13న ఆర్కిటిక్‌లో పెరిగిన చైనా కార్యకలాపాల గురించి నేటో చీఫ్ మార్క్ రుట్టే కూడా ప్రస్తావించారు. కానీ రష్యా ఎందుకు ట్రంప్‌ను ప్రశంసిస్తోంది? బహిరంగంగా ప్రోత్సహిస్తోంది? అన్నది ప్రశ్న. “ప్రస్తుత పరిస్థితి నుంచి రష్యా భారీ ప్రయోజనాలను ఆశిస్తోంది” అని స్టీవ్ రోసెన్‌బర్గ్ అన్నారు. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌కు ఉన్న మక్కువ, ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఆయన సంకల్పం, ఈ ప్రణాళికను వ్యతిరేకించే యూరోపియన్ దేశాలపై సుంకాలు విధిస్తామనే ఆయన బెదిరింపు, ట్రాన్స్ అట్లాంటిక్ కూటమితోపాటు అమెరికా, యూరప్ మధ్య, అలాగే నేటో అంతర్గత సంబంధాలపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. పాశ్చాత్య కూటమిని బలహీనపరిచే లేదా విచ్ఛిన్నం చేసేది ఏదైనా రష్యా దృష్టిలో పెద్ద సానుకూల అంశం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: