ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల (Narcotics) నుంచి ప్రజలను రక్షించేందుకు పాలకులు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. ఈ ముఠాల ఆగడాలు అదుపులో ఉండడం లేదు. చాపకింద నీరులా డ్రగ్స్ నదుల్లా ప్రవహిస్తున్నది. దీంతో చిన్న పిల్లల నుంచి యువత, పెద్దలు ఈ మత్తుపదార్థాలకు బానిసగా మారిపోతూ అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ప్రపంచంతో
పాటు మనదేశం కూడా ఈ సమస్యతో సతమతమవుతున్నది.
Britain:యూదుల ప్రార్థనామందిరంపై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ప్రభుత్వం డ్రగ్ పై యుద్ధాన్ని ప్రకటించింది. మాదకద్రవ్యాల ముఠాలతో(డ్రగ్స్ కార్టెల్స్) తాము ఒక అంతర్జాతీయేతర సాయుధ సంఘర్షణలో ఉన్నామని అమెరికా సంచనల ప్రకటన చేసింది.
ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం తమ దేశ కాంగ్రెస్కు అధికారికంగా తెలియజేసింది. డ్రగ్స్ ముఠాల (Drug gangs) ను ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తున్నామని, వాటిపై సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికాలోనూ, అంతర్జాతీయంగానూ తీవ్ర చర్చకు దారితీసింది.
అమెరికా దాడిలో 17మంది మృతి
గత నెల కరేబియన్ (Caribbean) సమీపంలోని అంతర్జాతీయ జిల్లాలో అమెరికా సైనిక దళాలు మూడుపడవలను ముంచివేశాయి. వెనిజులా నుంచి వస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈపడవలపై జరిపిన దాడిలో 17 మంది మరణించారు. మరణించిన వారిని ‘చట్టవిరుద్ధ పోరాట యోధులు’గా అభివర్ణించిన అమెరికా, తమ చర్యలను ఆత్మరక్షణగా సమర్థించుకుంది.
వైట్ హౌస్ (White House) విడుదల చేసిన ఒక మెమో ప్రకారం, ఈ డ్రగ్స్ ముఠాలు దేశ సరిహద్దులు దాటి పశ్చిమార్థ గోళం అంతటా అమెరికాపై నిరంతర దాడులకు పాల్పడుతున్నాయని,అందుకే వీటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించామని పేర్కొంది. అయితే, ఏయే ముఠాలను లక్ష్యంగా చేసుకున్నారో, వాటితో మృతులకుఉన్న సంబంధం ఏమిటో మాత్రం ప్రభుత్వంవెల్లడించలేదు.
ట్రంప్ పై పెరుగుతున్న వ్యతిరేకత
ట్రంప్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్మ్స్ సర్వీసెస్ కమిటీలో డెమొక్రాటిక్ పార్టీకి (Democratic Party) చెందిన సీనియర్ సెనేట్ జాడ్ రీడ్ ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. ‘ట్రంప్ తనకు శత్రువు అనిపించిన ఎవరిపైనైనా రహస్య యుద్ధాలు చేయవచ్చని నిర్ణయించుకున్నారు’ అని ఆయన ఆరోపించారు.
ఈ సైనిక దాడులకు ప్రభుత్వం ఎలాంటి సరైన చట్టపరమైన ఆధారాలు గానీ, నిఘా సమాచారం గానీ చూపలేదని ఆయన విమర్శించారు. మరోవైపు ఈ ప్రాంతంలో అమెరికా తన సైనిక మోహరింపును భారీగా పెంచింది. ఇప్పటికే కరేబియన్ ప్రాంతానికి యుద్ధనౌకలను పంపిన పెంటగాన్, సుమారు 6,500 మందికిపైగా సైనికులను మోహరించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో తెలిపింద.
ఈ పరిణామాలపై వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్ ముఠాల సాకుతో లాటిన్ అమెరికాలో ప్రభుత్వాలను మార్చేందుకు, సైనిక జోక్యానికి అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. నిజంగా అమెరికాను డ్రగ్స్ సమస్యతో ఇబ్బందిపడుతుంటేట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయమే.
Read hindi news: hindi.vaartha.com
Read Also: