యుద్ధంలో ఇజ్రాయిల్‌కు సపోర్ట్ చేసిన ట్రంప్ యుద్ధం ముగిశాక గాజాపై ఒక్కసారిగా ప్రేమ పొంగుకొచ్చింది. గాజాపై అమెరికా అధ్యక్షుడు ఎన్నడూ లేని సానుభూతి చూపించడం వెనుక ఓ పెద్ద స్వార్థం ఉంది. అంతేకాదు గాజా పునర్నిర్మాణంలో ట్రంప్ వేల కోట్లు సొమ్ము చేసుకునే ప్లాన్ బయటపడింది. గాజా(Gaza)లో మాస్టర్ ప్లాన్ పేరిట రియల్ ఎస్టేట్ దందా స్టార్ట్ చేద్ధాంమని ట్రంప్ అల్లుడిని దింపాడు. యుద్ధంలో గాజా స్ట్రిప్ పూర్తిగా విధ్వంసమైయ్యేంత వరకూ చూసి అక్కడ జనాల్ని వేరే చోటుకు తరలించి ఆ విలువైన భూములు అమెరికా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూసింది. వేలాది గాజా ప్రజల శవాల దిబ్బలపై ట్రంప్ కాసులు కురిపించే కంచుకోట కట్టుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగా గాజా పీస్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి పనులు ప్రారంభించారు. పునర్నిర్మాణం పేరుతో గాజాని ట్రంప్ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అక్కడ నిర్మాణాలు చేసేది కూడా ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్.. ఇతనో బాడా రియల్ ఎస్టేట్ వ్యాపారి. యుద్ధంలో పూర్తిగా దెబ్బతిన్న గాజాని టూరిజం హబ్‌గా మార్చి డబ్బులు చేసుకుందామనే ట్రంప్ ప్లాన్ దావోస్‌లో బయటపడింది.
Read Also: Iran: పాపం బంకర్‌లో జీవిస్తున్న ఖమేనీ
గాజాని మధ్యప్రాచ్యపు ‘రివేరా’లాగా మార్చాలనేది టార్గెట్
ఇజ్రాయిల్‌తో యుద్ధంలో చిన్నాభిన్నమైన గాజాని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు అగ్రరాజ్యం అమెరికా పునర్నిర్మాణం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన ఈ ప్రణాళికను వివరించారు. కుష్నర్ రూపొందించిన ఈ ప్రణాళికలో గాజాని మధ్యప్రాచ్యపు ‘రివేరా’లాగా మార్చాలనేది టార్గెట్. ఈ నిర్మాణం కేవలం రెండు లేదా మూడు సంవత్సరాలలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆధునిక యుటిలిటీలు, ప్రజా సేవలను అభివృద్ధి చేయడానికి ఈ ప్రణాళికకు $25 బిలియన్లకు పైగా అవసరమని శాంతి బోర్డు అంచనా వేసింది.
విలాసవంతమైన పర్యాటక కేంద్రం
గాజా సముద్ర తీర ప్రాంతాన్ని విలాసవంతమైన పర్యాటక కేంద్రం గా మార్చాలని కుష్నర్ ప్రతిపాదించారు. ఇందులో అత్యాధునిక నివాస గృహాలు, ఆకర్షణీయమైన బిల్డింగులు, ‘స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ల’ను ఏర్పాటు చేయనున్నారు. ఇది కోస్టల్ టూరిజంను చూపిస్తుంది. ఇందులో 170 రెసిడెన్షియల్ టవర్లు, డేటా సెంటర్లు, ఫ్యాక్టరీలు ఉన్నాయి, వీటిని పార్కులు, వ్యవసాయం క్రీడా సౌకర్యాల ద్వారా విభజించారు. ఎత్తైన భవనాలు, హోటళ్ళు, విలాసవంతమైన విల్లాలను ఏర్పాటు చేయనున్నారు. గాజాలో కొత్త విమానాశ్రయం, పెద్ద ఓడరేవు, అధునాతన రహదారులను నిర్మించాలని ప్లాన్ చేశారు. దీని ద్వారా గాజా జీడీపీని 10 బిలియన్ డాలర్లకు పెంచవచ్చని ఆయన అంచనా వేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: