అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దౌత్యపరమైన వ్యూహాలతో ప్రపంచ రాజకీయాలను వణికిస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించి, గొప్ప విజయాన్ని సాధించినట్లు మురిసిపోతున్న ట్రంప్.. తన తదుపరి గురిని క్యూబాపై పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏడు దశాబ్దాలుగా క్యూబా(Cuba)ను ఏలుతున్న కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కూల్చివేసి.. అక్కడ తమకు అనుకూలమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
Read Also: America: చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ
వెనిజులా మోడల్.. క్యూబాపై ప్రయోగం!
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. వెనిజులాలో మదురోను పట్టుకోవడానికి అనుసరించిన ‘బ్లూ ప్రింట్’నే క్యూబాలోనూ అమలు చేయాలని ట్రంప్ బృందం భావిస్తోంది. క్యూబా ప్రభుత్వ అంతర్గత వర్గాల్లో తమకు సహకరించే ఇన్‌సైడర్ కోసం అమెరికా గాలిస్తోంది. “సమయం మించిపోకముందే ఒప్పందానికి రండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు” అంటూ ట్రంప్ ఇప్పటికే తన ట్రూత్ సోషల్ వేదికగా క్యూబా పాలకులకు అల్టిమేటం జారీ చేశారు.
క్యూబాకు ప్రధాన అండగా ఉన్న వెనిజులాలో ప్రభుత్వం మారడంతో.. హవానాకు అందుతున్న సబ్సిడీ చమురు నిలిచిపోయింది. దీని వల్ల క్యూబా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుంది. నిత్యావసర వస్తువులు, మందుల కొరతతో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు సర్వ సాధారణం అయిపోయాయి. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని.. క్యూబా విదేశాలకు పంపే మెడికల్ మిషన్లపై ఆంక్షలు విధించడం ద్వారా ఆ దేశానికి అందే విదేశీ కరెన్సీని అడ్డుకోవాలని అమెరికా ప్లాన్ చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: