📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Visa: వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్‌ రద్దు..బాంబ్ పేల్చిన ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: October 30, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో హెచ్ 1 బీ (H-1B)కాకుండా వచ్చే మిగతా వీసాల వారు అక్కడ వర్క్ చేయాలంటే ప్రత్యేక పర్మిట్ పొందాలి. దాన్ని EAD(EAD) అంటారు. హెచ్ 1బీ డిపెండెంట్లుగా వచ్చే వారు ఎక్కువగా దీని కోసం అప్లై చేస్తారు. EAD తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటారు. ఇంకా చాలా వీసాల వాళ్ళు కూడా ఈ వర్క్ పర్మిట్ లను తీసుకోవాల్సిందే. ఇప్పుడు ట్రంప్ సర్కార్ వీటిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై EAD లను ఆటో మాటిక్ గా రెన్యువల్ చేయమని ప్రకటించింది. దీనికి సంబంధించి యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ ప్రకటన జారీ చేసింది.

Read Also: Bangalore: డెలివరీ బాయ్ ని కారుతో ఢీ కొట్టిన దంపతులు 

Visa

విదేశీ ఉద్యోగులపై ప్రభావం

యూఎస్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది విదేశీ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా అతి ఎక్కువగా భారతీయులకు ఇది పెద్ద దెబ్బ కానుంది. ఎక్కువ మంది ఇండియన్స్ అమెరికాలో హెచ్ 4 మీద ఉన్నారు. హెచ్ 1బీ వీసా మీద వచ్చే వారి లైఫ్ పార్టనర్స్ అందరూ డిపెండెంట్ హెచ్ 4 వీసాల మీద వస్తారు. వీరందరూ అమెరికాలో వర్క్ చేయాలంటే EAD తీసుకోవాల్సిందే. కంపెనీలు వారికి ప్రత్యేకంగా హెచ్ 1బీ చేయిస్తే ఓకే కానీ..లేకపోతే వర్క్ పర్మిట్ తీసుకుని ఉద్యోగాలు చేయాలి. డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ ఈ వర్క్ పర్మిట్లను సాధారణంగా నాలుగు నుంచి ఆరు నెలలకు ఇస్తుంది. ఆ తరువాత అవి రెన్యూవల్ అవుతుంటాయి. ఇప్పటి వరకు ఇవి ఆటోమాటిక్ గా రెన్యూవల్ అవుతూ వస్తున్నాయి.

ప్రతీసారీ EAD ని కొత్తగా అప్లే చేసుకోవాలి

కానీ ఇప్పుడు అలా అవదని ట్రంప్ గవర్నమెంట్ చెప్పేసింది. దీంతో ఇక మీదట ప్రతీసారీ EAD ని కొత్తగా అప్లే చేసుకుంటూ పోవాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. పైగా అప్లై చేసిన ప్రతీసారీ ఇవ్వాలని రూల్ కూడా ఉండదు. వర్క్ పర్మిట్ లేకపోతే పని చేయడం కుదరదు. దీని కారణంగా ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు గందరగోళంలో పడనున్నాయి. ఈ కొత్త రూల్ ను ఇమ్మిడియట్ గా రేపటి నుంచే అంటే అక్టోబర్ 30 నుంచే అమలు చేయనున్నారు. అంతేకాదు ఇక మీదట ఎవరు వర్క్ పర్మిట్ను అప్లై చేసుకున్నా తనిఖీలు, స్క్రీనింగ్ చేస్తామని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ తెలిపింది. వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసే లోపునే మళ్ళీ అప్లే చేసుకోవచ్చని చెప్పింది.

EAD వీసా అంటే ఏమిటి?
పౌరసత్వం లేదా జాతీయతతో సంబంధం లేకుండా అన్ని ఉద్యోగులు యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేయడానికి అధికారం కలిగి ఉన్నారని US యజమానులు నిర్ధారించుకోవాలి. ఉపాధి అధికార పత్రం (ఫారమ్ I-766/EAD) కలిగి ఉండటం అనేది మీరు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేయడానికి అధికారం కలిగి ఉన్నారని నిరూపించడానికి ఒక మార్గం.

EAD వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
EAD ఒక వ్యక్తికి యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేయడానికి చట్టపరమైన హోదాను ఇస్తుంది కానీ గ్రీన్ కార్డ్ కంటే తక్కువ ప్రత్యేక హక్కులు కలిగి ఉంటుంది. ఇది గడువు తేదీని (సాధారణంగా జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం) చూపిస్తుంది మరియు పునరుద్ధరించదగినది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Donald Trump Green Card immigration policy Latest News Breaking News Telugu News US Immigration Visa Rules Work Permits

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.