రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ .. వలసలు, సుంకాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారత్ సహా అమెరికాకు ముఖ్య వాణిజ్య భాగస్వాములుగా ఉన్న దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వాణిజ్య భాగస్వామ్య దేశాలు చర్చించేందుకు సమయం ఇస్తూ వస్తోన్న ట్రంప్.. తాజాగా సుంకాల విధింపును మరోసారి వాయిదా వేశారు. ఆగస్టు 1 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాకు ఆసియాలో కీలక భాగస్వాములుగా ఉన్న జపాన్ , దక్షిణ కొరియా దేశాలపై పెద్ద ఎత్తున సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యారు. ఈరెండు దేశాలపై 25 శాతం సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ సోమవారం నాడు ప్రకటించారు.
జపాన్, దక్షిణ కొరియాలపై 25% సుంకాలు
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్, వలసలు, సుంకాలను కఠినతరం చేస్తున్నారు. భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యారు. జపాన్, దక్షిణ కొరియాలపై 25% సుంకాలు విధిస్తూ ఆగస్టు 1 నుంచి అమలు చేయనున్నారు. భారత్‌కు కూడా సుంకాల విధింపుపై చర్చించేందుకు కాస్త సమయం దొరికినట్లైంది. మరి ఈ సుంకాల విధింపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాలంటే.. మరి కాస్త సమయం వేచి చూడాలి. ట్రంప్ ప్రభుత్వం ఆసియాలోని జపాన్, దక్షిణ కొరియా దేశాలకు భారీ షాక్ ఇచ్చింది. ఈ రెండు దేశాలపై ప్రతీకార సుంకాలను 25 శాతం విధిస్తూ.. ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తాయని తెలిపింది. అంతేకాదు, భారత్‌కు కూడా మరికొంత గడువు ఇచ్చింది. సుంకాల విషయంలో చర్చలు జరిపేందుకు ఆగస్టు 1 వరకు టైమ్ ఇచ్చింది. ఆ తర్వాత భారీ సుంకాలు తప్పవని హెచ్చరించింది.
జపాన్, దక్షిణ కొరియా నేతలకు లేఖలు
ఈ క్రమంలో ట్రంప్.. జపాన్, దక్షిణ కొరియా నేతలకు లేఖలు రాశారు. వాటిని తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే జపాన్, దక్షిణ కొరియా దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. సుంకాలు పెంచితే వాటి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు నష్టపోతాయని హెచ్చరించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. మీరు ఏ కారణాలవల్ల సుంకాలను పెంచినా ఇప్పుడు మేం విధించిన 25శాతానికి అదనంగా ఆ సుంకాలను వేస్తాం అని హెచ్చరించారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపారు. అలానే మిగిలిన దేశాలకు కూడా ప్రతీకార సుంకాల గడువును ఆగస్టు 1 వరకు పొడిగించారు.
భారత్, అమెరికా మధ్య త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం
సుంకాల ఉపశమానికి ఇచ్చిన గడువు రేపటితో అనగా జులై 9, బుధవారంతో ముగియనుంది. ఈ క్రమంలోనే ట్రంప్ మరోసారి దానిని ఆగస్టు 1 వరకు పొడిగించారు. ఈలోగా చర్చలకు రావాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒప్పందాలు కుదుర్చుకోని దేశాలకు లేఖలు పంపడం మొదలుపెట్టింది అమెరికా ప్రభుత్వం. ఆగస్టు 1 నుంచి భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తోంది. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు సుంకాల విషయంలో కాస్త ఊరట లభించినట్లైంది. సుంకాల విధింపు మరి కొన్ని రోజులు వాయిదా పడింది. ఈలోపు భారత్, అమెరికా మధ్య త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 2న ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు మొదలయ్యాయి. స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో ట్రంప్ సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేశారు. ఆ గడువు బుధవారంతో ముగియనుంది. ఈ క్రమంలో మరోసారి దాన్ని వాయిదా వేస్తూ.. ఆగస్టు 1 నుంచి విధించేందుకు సిద్ధమయ్యారు .
ట్రంప్ సుంకాలు చట్టబద్ధమైనవేనా?
అన్ని దిగుమతులను ప్రభావితం చేసే విస్తృత, సార్వత్రిక సుంకాలను విధించడానికి అతను అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద అపూర్వమైన అధికారాలను కూడా ఉపయోగించాడు. IEEPA యొక్క ఈ ఉపయోగం రాజ్యాంగ విరుద్ధమని సమాఖ్య కోర్టులు తీర్పు ఇచ్చినప్పటికీ, అప్పీల్ పెండింగ్‌లో ఉన్న నిర్ణయాలు నిలిపివేయబడ్డాయి, తద్వారా సుంకాలు అమలులో ఉండటానికి వీలు కల్పించింది.
4 రకాల సుంకాలు ఏమిటి?
AI అవలోకనం
నాలుగు ప్రాథమిక రకాల సుంకాలు ఉన్నాయి: నిర్దిష్ట, ప్రకటన విలువ, సమ్మేళనం మరియు సుంకం-రేటు కోటాలు. ఈ సుంకాలు దిగుమతి చేసుకున్న వస్తువులకు ఎలా లెక్కించబడతాయి మరియు వర్తింపజేయబడతాయి అనే దానిలో విభిన్నంగా ఉంటాయి.
Read also: hindi.vaartha.com
Read Also: Brics: ట్రంప్ షాక్: బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు సుంకాలు