📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump : గ్రెటా పై ట్రాంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

Author Icon By Shiva
Updated: October 7, 2025 • 1:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గ్రెటాపై ట్రంప్ ఘాటైన వ్యాఖ్యలు

ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ వర్షం ట్రాంప్ కురిపించారు. గ్రెటాకు(Trump) కోప నియంత్రణ సమస్య ఉందని, తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆమెను సమస్యలు సృష్టించే వ్యక్తి గా అభివర్ణిస్తూ, పర్యావరణం పట్ల ఆమె ఆసక్తి తగ్గిపోయిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఆమె చాలా ఆగ్రహంగా, అసహనంగా ఉంటుంది. అంత చిన్న వయసులో ఇంత కోపం ఎందుకో అర్థం కావడం లేదు, అని ట్రంప్(Trump) అన్నారు. ఇటీవల గాజా ప్రజలకు మద్దతుగా వెళ్లిన గ్రెటాను ఇజ్రాయెల్ పోలీసులు అదుపులోకి తీసుకుని దేశం నుంచి బహిష్కరించిన ఘటన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read also: ఢిల్లీలో భారీ ఎర్రచందనం స్మగ్లింగ్

గాజా ఘటన, అంతర్జాతీయ ప్రతిస్పందనలు

గాజాపై ఇజ్రాయెల్ విధించిన నౌకా దిగ్బంధనానికి వ్యతిరేకంగా గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా పేరుతో ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా పడవల్లో కార్యకర్తలు గాజాకు బయలుదేరారు. ఈ బృందంలో గ్రెటాతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన నలుగురు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. కానీ గత శుక్రవారం ఇజ్రాయెల్ నౌకాదళం ఆ పడవలను అడ్డగించి, దాదాపు 450 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో గ్రెటా సహా 160 మందిని దేశం నుంచి బహిష్కరించి, వారు అనంతరం గ్రీస్‌కు చేరుకున్నారు.ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం, ఆ పడవల్లో ఎలాంటి సహాయ సామగ్రి లేవని, అవి హమాస్‌కు మద్దతుగా జరిపిన రాజకీయ ప్రదర్శన అని పేర్కొంది.

ఈ కార్యక్రమానికి హమాస్ నిధులు సమకూర్చినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా వెల్లడించింది. మరోవైపు, గాజాలో యుద్ధాన్ని నిలిపివేయాలనే లక్ష్యంతో ఈజిప్టులో శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి.ఈ సమావేశంలో హమాస్, ఇజ్రాయెల్,(Israel) అమెరికా ప్రతినిధులతో పాటు ఖతార్, టర్కీ, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా పాల్గొంటున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళిక పై చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల ద్వారా గాజాలో శాంతి నెలకొని, ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గుతాయని అంతర్జాతీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: https://epaper.vaartha.com/

Read Also:

Donald Trump greta Intrenational news Latest News in Telugu trump

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.