📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump: యూ ఆర్ బ్యూటిఫుల్..ఇటలీ ప్రధానిపై ట్రంప్ కామెంట్స్ !

Author Icon By Vanipushpa
Updated: October 14, 2025 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతున్నాయి. ఈజిప్టు వేదికగా జరిగిన గాజా శాంతి శిఖరాగ్ర సమావేశంలో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనిపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. “మీరు అందంగా ఉన్నారు, అనడానికి అభ్యంతరం లేదు కదా?” అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో సైతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా ఈ శాంతి సదస్సుకు ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు 20 దేశాల అధినేతలు హాజరయ్యారు. అయితే ఈ సదస్సుకు వెళ్తే ట్రంప్, షరీఫ్ లతో వేదిక పంచుకోవాల్సి వస్తుందనే కారణంతో భారత ప్రధాని మోడీ దూరంగా ఉండిపోయారు. అయితే దేశాధినేతలు, ప్రపంచ ప్రముఖుల సమక్షంలో అందరి ముందే ట్రంప్.. మెలోనిని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.

Read Also: Nicolas: మరియాకు నోబెల్ ప్రైజ్ పై ఆ దేశ అధ్యక్షుడి మండిపాటు

Gaza: యూ ఆర్ బ్యూటిఫుల్..ఇటలీ ప్రధానిపై ట్రంప్ కామెంట్స్ !

మీరు నిజంగా అందంగానే ఉన్నారు: ట్రంప్

ట్రంప్ ఏమన్నారంటే.. యునైటెడ్ స్టేట్స్‌లో ఒక మహిళ గురించి ‘అందమైన’ అనే పదాన్ని ఉపయోగిస్తే అది నా రాజకీయ జీవితానికి ముగింపు కావచ్చు. నాకు అలా మాట్లాడే అవకాశం లేదు, కానీ ఈ అవకాశాన్ని నేను తీసుకుంటున్నాను. మిమ్మల్ని అందంగా ఉన్నారని పిలవడానికి మీకు అభ్యంతరం లేదు కదా? ఎందుకంటే మీరు నిజంగా అందంగానే ఉన్నారు.” ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు మెలోని సహా వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో మెలోని ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం. అంతే కాకుండా ట్రంప్ జార్జియా నాయకత్వ సామర్థ్యాన్ని కూడా కొనియాడారు. మెలోని అద్భుతమైన నాయకురాలు అని కితాబిచ్చారు. ఇటలీ ప్రజలంతా మెలోనిని గౌరవిస్తారు, ఎందుకంటే ఆమె విజయవంతమైన రాజకీయ నాయకురాలు అన్నారు.

“ప్రపంచ శాంతికర్త” ట్రంప్‌: షెహబాజ్ షరీఫ్

మరోవైపు ఈ సదస్సులో మరో ఆసక్తికర సంఘటన కూడా చోటు చేసుకుంది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రసంగం మొదలు పెట్టగానే.. ఆద్యంతం డొనాల్డ్ ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ట్రంప్‌ను “ప్రపంచ శాంతికర్త”గా అభివర్ణించారు. మీరు గతంలో భారతదేశం-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపారు. ఇప్పుడు గాజా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా ఆపగలరు. ప్రపంచంలో అనేక యుద్ధాలని ఆపారు” అంటూ షరీఫ్ ప్రసంగించారు. కానీ అదే వేదికపై షెహబాజ్ షరీఫ్ ముందే ట్రంప్ అక్కడ లేని భారత ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. దీంతో పాక్ ప్రధాని షరీఫ్ షాక్ కి గురయ్యారు.

79 సంవత్సరాల వయసులో, 2025 నుండి యునైటెడ్ స్టేట్స్ యొక్క 47వ అధ్యక్షుడు మరియు 2017 నుండి 2021 వరకు 45వ అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్, రెండవసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అమెరికన్ చరిత్రలో అత్యంత పెద్ద వయస్కుడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

donald trump comments International Politics Italy Prime Minister Latest News Breaking News Political News Telugu News Trump controversy Trump Viral Statement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.