Trade Deal: ట్రంప్ క్లీన్ బోల్డ్ .. భారత్ పంతమే నెగ్గింది!

Read Time:  1 min
ట్రంప్ క్లీన్ బోల్డ్ .. భారత్ పంతమే నెగ్గింది!
ట్రంప్ క్లీన్ బోల్డ్ .. భారత్ పంతమే నెగ్గింది!
FONT SIZE
GET APP

భారత్, అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గత 10 నెలలుగా భారత్‌పై ఒత్తిడి పెంచుతూ.. భారీ సుంకాలు విధిస్తామని బెదిరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump).. ఒక్కసారిగా వెనక్కి తగ్గి ఒప్పందానికి మొగ్గు చూపడం వెనుక భారీ దౌత్య వ్యూహం దాగి ఉంది. ట్రంప్ వ్యూహం.. సీజ్ ఫైర్ క్రెడిట్ కోసం ఆరాటం ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పట్ల డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య సీజ్ ఫైర్ చేయించడం ద్వారా శాంతిదూతగా పేరు తెచ్చుకుని.. నోబెల్ బహుమతిని సాధించాలనేది ఆయన వ్యూహం. అయితే భారత్ నుంచి ఆయనకు ఆశించిన స్పందన లభించకపోవడంతో ఆగ్రహించిన ట్రంప్ 50 శాతం టారిఫ్ విధిస్తామని బెదిరించారు. కానీ అటు భారత ప్రభుత్వం గానీ.. ఇటు అమెరికా అధికార యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ వెళ్లాయి.

Read Also: CNN: మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం..ఎందుకంటే?

Trade Deal: ట్రంప్ క్లీన్ బోల్డ్ .. భారత్ పంతమే నెగ్గింది!
Trade Deal: ట్రంప్ క్లీన్ బోల్డ్ .. భారత్ పంతమే నెగ్గింది!

తెరవెనుక నడిచిన అసలు కథ

డొనాల్డ్ ట్రంప్ పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నప్పటికీ.. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ఎప్పుడూ ఆగలేదు. ఈ కీలక వాణిజ్య ఒప్పందం వెనుక అనేక కీలక అంశాలు ఉన్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, డిప్యూటీ ఎన్ఎస్ఏ పవన్ కపూర్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా నిరంతరం వాషింగ్టన్‌లో పావులు కదిపారు. గత కొన్ని నెలలుగా అమెరికాకు చెందిన పలువురు సెనేటర్లు, ప్రతినిధులు భారత్‌లో పర్యటించారు. క్లీన్ బోల్డ్ అయిన ట్రంప్.. భారత్ పంతమే నెగ్గింది! చివరికి ఏమైందంటే.. తన సొంత మంత్రులు, అధికారులు చెప్పిన లెక్కల ముందు డొనాల్డ్ ట్రంప్ పాత మాటలు చెల్లకుండా పోయాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.