📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gold imports : బంగారం దిగుమతుల సుంకాలపై స్పష్టత ఇచ్చిన ట్రంప్‌

Author Icon By Sudha
Updated: August 12, 2025 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారత్‌ సహా ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. అయితే, ట్రంప్‌ నిర్ణయంతో దిగుమతి చేసుకునే బంగారు (Gold imports) కడ్డీలపై సుంకాల పెంపు వర్తిస్తుందా? లేదా? అనే విషయంపై సందిగ్ధత రష్యా చమురు కొనుగోలు కారణంతో న్యూఢిల్లీపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 25 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చింది. ఆగస్టు 27 నుంచి మిగతా 25 శాతం టారిఫ్ అమలులోకి రానుంది. అయితే, ట్రంప్‌ నిర్ణయంతో దిగుమతి చేసుకునే బంగారు (Gold imports) కడ్డీలపై సుంకాల పెంపు వర్తిస్తుందా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ‘బంగారం’ లాంటి వార్త చెప్పారు. బంగారం దిగుమతులపై అదనపు సుంకాలు ఉండవని స్పష్టం చేశారు.

Gold imports : బంగారం దిగుమతుల సుంకాలపై స్పష్టత ఇచ్చిన ట్రంప్‌

ఒక కేజీతోపాటు 100 ఔన్సుల (2.8 కిలోల) బంగారు(Gold imports) కడ్డీలు సుంకాల పరిధిలోకి వస్తాయని అమెరికా కస్టమ్స్ అధికార వర్గాలు ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే. ఈమేరకు జులై 31న ఓ ప్రకటన విడుదల చేశారు. అదే సమయంలో గోల్డ్ బార్‌లపై సుంకాల విధింపుపై ట్రంప్‌ క్లారిటీ ఇస్తూ త్వరలోనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేస్తారని వైట్‌హౌస్ అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ విషయంలో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో పసిడి ధరలు కూడా అమాంతం పెరిగాయి. దీంతో ట్రంప్‌ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు బంగారంపై సుంకాలు విధించబోమంటూ ట్రూత్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ‘బంగారంపై సుంకాలు ఉండవు’ అని రాసుకొచ్చారు.

టాప్ 10 బంగారం ఎగుమతిదారు ఎవరు?

బంగారం ఎగుమతి డేటా ఆధారంగా, బంగారం ఎగుమతి చేసే టాప్ 10 దేశాలలో స్విట్జర్లాండ్, యుఎఇ, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, దక్షిణాఫ్రికా, రష్యా, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్ మరియు మాలి ఉన్నాయి.

బంగారం అతిపెద్ద కొనుగోలుదారు ఎవరు?

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలుదారు చైనా . ఈ సంవత్సరం 2018 తర్వాత చైనా అత్యధిక బంగారం దిగుమతి స్థాయికి చేరుకుంటోంది, 2022లో ఆ దేశం 1,343 టన్నులకు పైగా దిగుమతి చేసుకుంది.

భారతదేశంలో బంగారం అక్రమ రవాణా ఎంత?

2023-24 ఆర్థిక సంవత్సరంలో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) 1,319 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది, ముఖ్యంగా బంగ్లాదేశ్ మరియు మయన్మార్‌లతో భారతదేశం యొక్క తూర్పు సరిహద్దుల ద్వారా అక్రమంగా రవాణా చేయబడిన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/gold-prices-drop-sharply-2/business/529295/

Breaking News Donald Trump Gold Imports Gold Tariffs latest news Tariff Clarification Telugu News US Tariffs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.