📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Trump: వెనక్కి తగ్గిన ట్రంప్‌.. చైనాతో 90 రోజులు వాణిజ్యం ఒప్పందం

Author Icon By Vanipushpa
Updated: August 12, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Trump) భారత్‌(India)పై 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేస్తుందనే కారణంతో ఇటీవల 25 శాతం అదనంగా టారిఫ్‌ విధించారు. భారత్‌పై సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్.. చైనా విషయంలో మాత్రం భిన్న వైఖరిని అనుసరిస్తున్నారు. గతంలో ఆయన చైనా(China)పై చేసిన టారిఫ్ వార్ సంచలనం రేపింది. అమెరికా, చైనా ఒకదానికికొకటి టారిఫ్‌లు పెంచుకుంటూనే పోయాయి. ఈ తర్వాత వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అమెరికా(America) దిగుమతులపై సుంకాలను చైనా 125 నుంచి 10 శాతానికి తగ్గించింది. అలాగే చైనా దిగుమతులపై సుంకాలను అమెరికా 145 నుంచి 30 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు 90 రోజుల పాటు అమల్లో ఉండేలా ఇరుదేశాలు వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం
ఈ ఒప్పందం మంగళవారం అర్ధరాత్రి నాటికి ముగియనుంది. ఈ క్రమంలోనే ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని మరో 90 రోజుల పాటు పొడగించారు. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. వాణిజ్య ఒప్పంద చర్చల గడువును పొడిగించినట్లు చైనా మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం మరో 90 రోజుల పాటు పొడిగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Trump: వెనక్కి తగ్గిన ట్రంప్‌.. చైనాతో 90 రోజులు వాణిజ్యం ఒప్పందం

భారత్‌, చైనాతో పాటు అనేక దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు
ఇక భారత్‌పై అమెరికా 25 శాతం అదనంగా టారిఫ్ విధించడంతో ఇది ఆగస్టు 27 నుంచి అమలు కానుంది. భారత్‌, చైనాతో పాటు అనేక దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. కానీ చైనాతో మాత్రం ఈ ట్రేడ్ డీల్‌ పూర్తి కావడం లేదు. దీనిపై ఇరుదేశాలు చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పలు అంశాల్లో ఏకాభిప్రాయానికి రానట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది చివర్లో అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య భేటీ జరగనుంది.ఆ సమావేశంలో ట్రేడ్‌ డీల్‌ పూర్తిచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్‌ పాటు చైనా కూడా రష్యా నుంచి భారీగా చమురును ఎగుమతి
మరోవైపు ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మాట్లాడారు. అయితే సుంకాల విషయంలో చైనా కొంచెం సంక్లిష్టంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రష్యా నుంచి చైనా చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. భారత్‌ పాటు చైనా కూడా రష్యా నుంచి భారీగా చమురును ఎగుమతి చేసుకుంటోంది. మరోవైపు రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో అదనంగా 25 శాతం సుంకాలు విధించారు. ఇంతకుముందే 25 శాతం టారిఫ్‌ విధించగా.. దాన్ని 50 శాతానికి పెంచారు.

చైనా మరియు అమెరికా మధ్య సంబంధం ఏమిటి?
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) మధ్య సంబంధం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధం. 1949లో PRC స్థాపన మరియు చైనా రిపబ్లిక్ ప్రభుత్వం తైవాన్‌కు వెనక్కి తగ్గినప్పటి నుండి ఇది సంక్లిష్టంగా మరియు కొన్నిసార్లు ఉద్రిక్తంగా ఉంది.
2000 నాటి US చైనా సంబంధాల చట్టం ఏమిటి?
విభాగం B: యునైటెడ్ స్టేట్స్-చైనా సంబంధాలు - శీర్షిక II: సాధారణ నిబంధనలు - 2000 నాటి US-చైనా సంబంధాల చట్టం - ఇది యునైటెడ్ స్టేట్స్ యొక్క విధానంగా ప్రకటిస్తుంది: (1) వాణిజ్యం యొక్క ప్రయోజనాలను విస్తృతం చేసే వాణిజ్య సంబంధాలను అభివృద్ధి చేయడం మరియు శ్రమ, పర్యావరణ, వాణిజ్య తగ్గుదలకు బదులుగా పెరుగుదలకు దారితీస్తుంది.
China trade deal Donald Trump Global Economy International Trade Latest News Breaking News Telugu News Trade Agreement US-China relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.