Trump attack news : Ryan Rout అనే 60 ఏళ్ల వ్యక్తి, అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో మాజీ అధ్యక్షుడు Donald Trumpపై హత్యాయత్నానికి కుట్ర పన్నిన కేసులో జీవిత ఖైదు శిక్షను ఎదుర్కొన్నాడు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ గోల్ఫ్ క్లబ్‌లో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని స్నైపర్ దాడి చేయాలనే ప్రణాళిక రచించినట్లు కోర్టులో నిరూపితమైంది. ఫెడరల్ కోర్టు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించి, జీవితకాల జైలు శిక్షతో పాటు అదనంగా ఏడు సంవత్సరాల శిక్షను విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
దర్యాప్తులో రౌత్ నెలల తరబడి ట్రంప్ కదలికలు, భద్రతా వివరాలు, గోల్ఫ్ కోర్స్ మ్యాప్స్‌పై అధ్యయనం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఘటన రోజు చెట్ల పొదల్లో తుపాకితో దాక్కున్న అతడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించడంతో కుట్ర భగ్నమైంది. అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు పశ్చాత్తాపం చూపకపోవడం అతడి మానసిక స్థితిపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం
తీర్పు ప్రకటించే సమయంలో కోర్టులోనే రౌత్ పెన్నుతో తనను తాను గాయపరుచుకునేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అతడికి మానసిక సమస్యలు ఉన్నాయని లాయర్లు వాదించినప్పటికీ, కోర్టు ఆ వాదనను తిరస్కరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసిన వారిపై ఎలాంటి ఉపశమనం ఉండదనే సందేశాన్ని ఈ తీర్పు స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: