📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: ట్రంప్ హత్యకు కుట్ర? వైట్ హౌస్‌పై దాడి భయంతో లాక్‌డౌన్

Author Icon By Vanipushpa
Updated: July 16, 2025 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌(White House)లో జులై 16, 2025న భద్రతా ఉల్లంఘన కారణంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన సందర్భంగా వైట్ హౌస్‌ను తాత్కాలికంగా లాక్‌డౌన్(Lockdown) చేసినట్లు అధికారులు ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తి వైట్ హౌస్ భద్రతా కంచె దాటి ఒక ఫోన్‌ను నార్త్ లాన్‌పైకి విసిరినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వైట్ హౌస్‌లోనే ఉన్నారని, ఈ ఘటన ఆయనపై హత్యాయత్నంతో ముడిపడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన ట్రంప్‌పై 2024లో జరిగిన హత్యాయత్నం జరిగిన రోజు సమీపంలో సంభవించడం గమనార్హం.

ట్రంప్ హత్యకు కుట్ర? వైట్ హౌస్‌పై దాడి భయంతో లాక్‌డౌన్

భద్రతా ఉల్లంఘన
ఈ భద్రతా ఉల్లంఘన గురించి సమాచారం అందిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేగంగా స్పందించారు. వైట్ హౌస్‌లో ఉన్న పత్రికా ప్రతినిధులను తక్షణం బ్రీఫింగ్ రూమ్‌కు తరలించారు. ఈ ఘటనను బాంబు బెదిరింపుగా భావించిన అధికారులు, విసిరిన వస్తువు ఫోన్‌గా గుర్తించిన తర్వాత పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. అయితే, ఈ ఘటన ట్రంప్‌పై గతంలో జరిగిన హత్యాయత్నాల నేపథ్యంలో అనేక అనుమానాలను రేకెత్తించింది.
థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు
2024 జులై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్ ప్రచార ర్యాలీలో జరిగిన హత్యాయత్నంలో ఆయన చెవిలో గాయమైంది. థామస్ మాథ్యూ క్రూక్స్ అనే 20 ఏళ్ల యువకుడు AR-15 రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. క్రూక్స్‌ను సీక్రెట్ సర్వీస్ స్నిపర్ చంపేశాడు. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఫ్లోరిడాలోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ వద్ద ర్యాన్ రౌత్ అనే వ్యక్తి ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రయత్నించాడు.

ట్రంప్‌పై డ్రోన్ దాడి..

ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు జవాద్ లారిజానీ ట్రంప్‌పై డ్రోన్ దాడి ద్వారా హత్యాయత్నం చేయాలని బహిరంగంగా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఇరాన్‌లో “బ్లడ్ పాక్ట్” అనే వెబ్‌సైట్ ద్వారా ట్రంప్ హత్య కోసం నిధుల సేకరణ జరుగుతోందని, ఇప్పటివరకు 27 మిలియన్ డాలర్లు సేకరించినట్లు వార్తలు తర్వాత ఈ ఘటన సందర్భంగా ట్రంప్ హత్యకు కుట్ర అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి .

Read hindi news: hindi.vaartha.com

Read Also: TTD: 19న అక్టోబర్ నెల ఆర్జితసేవల టిక్కెట్లు విడుదల

#telugu News Assassination attempt Conspiracy News Donald Trump Security Alert terror threat Trump Assassination Plot US Politics White House Lockdown

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.