ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తాను భేటీ (He met with Putin) కానున్నట్టు ఆయన వెల్లడించారు.ఆగస్టు 15న అలాస్కాలో ఈ సమావేశం జరగనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో దీన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ భేటీపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. అయితే రష్యా ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాలేదు.ఈ సమావేశంలో కొన్ని భూభాగాల మార్పిడిపై చర్చలు జరిగే అవకాశముంది. ఇరు దేశాలకు నష్టం లేకుండా, లాభంగా ఉండేలా పరిష్కారం తీసుకొస్తానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
గత చర్చలు ఎందుకు ఫలించలేదు?
2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన తర్వాత యుద్ధం తీవ్రమైంది. ఇప్పటివరకు మూడుసార్లు శాంతి చర్చలు జరిగాయి. కానీ అవి ఫలితమివ్వలేదు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా చొరవకు ప్రాధాన్యం పెరిగింది.ట్రంప్‌తో భేటీకి ముందు పుతిన్ కొన్ని కీలక నాయకులతో మాట్లాడారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీలతో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఉక్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమని చైనా తెలిపింది.ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. తనను పక్కన పెట్టి శాంతి చర్చలు జరగడం సరికాదని అభిప్రాయపడ్డారు. “నన్ను చర్చలలో భాగం చేయకుండా శాంతి సాధ్యం కాదు, అని ఆయన స్పష్టం చేశారు.
బైడెన్ తర్వాత ట్రంప్–పుతిన్ భేటీ
ఇది 2021 జెనీవా సమావేశానంతరం మరో ముఖ్యమైన ఘటన. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇరు దేశాల నేతలు భేటీ కావడం ఇదే మొదటిసారి.మూడేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధం ఎప్పటికి ఆగుతుందా అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. ట్రంప్–పుతిన్ సమావేశం ద్వారా ఒక శాంతియుత మార్గం దొరికే అవకాశముందా? అన్నదే ఇప్పుడు గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also : Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు