అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌ల్యాండ్‌పై నిర్మించాలనుకున్న “గోల్డెన్ డోమ్” క్షిపణి రక్షణ ప్రాజెక్టును కెనడా తిరస్కరించడంపై ఆయన మండిపడ్డారు. కెనడా అమెరికాకు బదులుగా చైనాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటోందని, అలా చేస్తే చైనా వారిని ఏడాదిలోనే “మింగేస్తుందని” ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “ట్రూత్ సోషల్” వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. “గ్రీన్‌ల్యాండ్‌పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోంది. వాస్తవానికి ఈ గోల్డెన్ డోమ్ కెనడాను కూడా రక్షిస్తుంది. కానీ దానికి బదులుగా వారు చైనాతో వ్యాపారం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే చైనా వారిని ఏడాదిలోపే మింగేస్తుంది” అంటూ ఆయన పేర్కొన్నారు.
Read Also: Fern Winter Storm Usa: ఫెర్న్ తుఫాను గుప్పిట్లో అమెరికా
తమ దేశం పట్ల కృతజ్ఞతతో ఉండాలని డిమాండ్
ఇటీవల కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వేదికగా చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం రాజుకుంది. బుధవారం డబ్ల్యూఈఎఫ్ (WEF) 56వ వార్షిక సదస్సులో ట్రంప్ (Trump) మాట్లాడుతూ.. అమెరికా నుంచి కెనడా పొందుతున్న ఉచిత సేవలకు గాను వారు తమ దేశం పట్ల కృతజ్ఞతతో ఉండాలని చెప్పారు. కానీ కెనడా ప్రధానమంత్రి ఆ స్థాయిలో కృతజ్ఞతతో లేరని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. తాను ప్రతిపాదించిన “గోల్డెన్ డోమ్” క్షిపణి రక్షణ వ్యవస్థ కెనడాకు కూడా భద్రత కల్పిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. “మార్క్ మాట్లాడే ముందు.. అమెరికా వల్లే తన దేశం మనుగడ సాగిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని ట్రంప్ సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: