Donald Trump : అమెరికా అధ్యక్షుడు Donald Trump ప్రాణాలకు పెద్ద ప్రమాదమే తప్పింది. జనవరి 20 రాత్రి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు బయలుదేరిన ట్రంప్ విమానం, టేకాఫ్ అయిన అరగంటకే తిరిగి వెనక్కి వచ్చింది. అధికారిక పర్యటనల కోసం ఉపయోగించే ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో అకస్మాత్తుగా టెక్నికల్ లోపం తలెత్తింది.
బోయింగ్ 747-8 విమానంలో ఒక్కసారిగా లైట్లు ఆగిపోవడంతో పైలట్లు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని (Donald Trump) వెనక్కి తిప్పి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం ట్రంప్ మరో విమానం అయిన ఎయిర్ ఫోర్స్ C-32 ద్వారా దావోస్‌కు బయలుదేరారు.
‘గాల్లో ప్రయాణించే వైట్ హౌస్’గా పేరొందిన ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఈ తరహా సాంకేతిక సమస్య రావడం అనుమానాలకు దారితీసింది. ఈ విమానం ఖతార్ రాజకుటుంబం నుంచి ట్రంప్‌కు బహుమతిగా లభించిన అత్యంత విలాసవంతమైన బోయింగ్ 747-8. ఇందులో అధ్యక్షుడి కార్యాలయం, బెడ్‌రూమ్‌లు, మీటింగ్ హాళ్లు, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. మిస్సైల్ దాడులను తప్పించుకునే డిఫెన్స్ సిస్టమ్, న్యూక్లియర్ దాడుల నుంచి రక్షణ కల్పించే షీల్డింగ్ కూడా ఇందులో భాగం.
Read Also: Google : తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
అత్యవసర పరిస్థితుల్లో గాల్లోనే ఇంధనం నింపుకునే సదుపాయం ఉన్న ఈ విమానాన్ని ట్రంప్ తన పదవీకాలం ముగిసే వరకు తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించనున్నారు. ఈ ఘటనతో అధ్యక్షుడి భద్రతపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: