📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump: ట్రంప్‌ నిజమైన శాంతికాముకుడు: షరీఫ్

Author Icon By Vanipushpa
Updated: October 15, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పొగడ్తల వర్షం కురిపించారు. ట్రంప్‌ను “నిజమైన శాంతికాముకుడు” అని అభివర్ణించిన ఆయన, భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నివారించారని కితాబిచ్చారు. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన గాజా సదస్సులో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అయితే, షరీఫ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాజా సదస్సులో ప్రపంచ నాయకులను ఉద్దేశించి షెహబాజ్ షరీఫ్ ఐదు నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పోషించిన పాత్రను కొనియాడారు. “అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో జరిగిన అవిశ్రాంత ప్రయత్నాల వల్ల శాంతి సాధ్యమైంది. ఇది సమకాలీన చరిత్రలో ఒక గొప్ప రోజు. ఆయన నిజంగా శాంతికాముకుడు” అని షరీఫ్ అన్నారు.

Read Also: Data Center: టెక్ ప్రపంచంలో ఏపీకి ఘనత: నారా లోకేష్

Trump: ట్రంప్‌ నిజమైన శాంతికాముకుడు: షరీఫ్

“వావ్! నేను ఇది ఊహించలేదు”: ట్రంప్

అంతటితో ఆగకుండా, “ఒకవేళ ట్రంప్ జోక్యం చేసుకోకపోయి ఉంటే, భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణ తీవ్ర స్థాయికి చేరేది. ఏం జరిగిందో చెప్పడానికి కూడా ఎవరూ మిగిలి ఉండేవారు కాదు” అని ఆయన పేర్కొన్నారు. మధ్య ఆసియాలో శాంతిని ప్రోత్సహించడంలో ట్రంప్ చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా, పాకిస్థాన్ ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించిందని షరీఫ్ గుర్తుచేశారు. “ఆయన శాంతిని ప్రేమించే తీరుకు మనం చేయగలిగిన కనీస గౌరవం ఇదే” అని ఆయన తన ప్రసంగంలో తెలిపారు. షరీఫ్ ప్రశంసలకు ట్రంప్ చిరునవ్వుతో స్పందిస్తూ, “వావ్! నేను ఇది ఊహించలేదు” అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలకు అవమానకరం

షరీఫ్ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన ట్రంప్‌ను అనవసరంగా పొగుడుతూ పాకిస్థానీయుల పరువు తీస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థానీ రాజకీయ నాయకుడు, చరిత్రకారుడు అమ్మర్ అలీ జాన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, “షెహబాజ్ షరీఫ్ అనవసరంగా ట్రంప్ భజన చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలకు అవమానకరం” అని విమర్శించారు.

24 కోట్ల పాకిస్థాన్ ప్రజలకు అవమానం

మరోవైపు, కాలమిస్ట్ ఎస్ఎల్ కాంతన్, పాక్ ప్రధాని తీరును తప్పుబట్టారు. “ట్రంప్‌కు ఎప్పుడు బూట్లు పాలిష్ చేయించుకోవాలనిపించినా, పాకిస్థాన్ ప్రధానిని పిలుస్తారు. భౌగోళిక రాజకీయాల్లో ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు” అని ఆయన ఎక్స్‌లో ఆరోపించారు. “షెహబాజ్ షరీఫ్ 24 కోట్ల పాకిస్థాన్ ప్రజలకు అవమానం” అని అసద్ అనే మరో యూజర్ వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

International Relations Latest News Breaking News Nawaz Sharif on Trump Telugu News Trump Diplomacy Trump global politics Trump peace efforts us pakistan relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.