India US trade war : అమెరికా మాజీ ఆర్మీ కల్నల్, రక్షణ విశ్లేషకుడు డగ్లస్ మాక్‌గ్రెగర్ భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. ఏ దేశమూ తన జాతీయ ప్రయోజనాలను పక్కనబెట్టి ఇతర దేశాల ఒత్తిడికి లోనుకాదు అని ఆయన స్పష్టం చేశారు. రష్యాతో వ్యాపారం చేస్తోందన్న కారణంతో భారత్‌పై ఆంక్షలు లేదా సుంకాలు విధించడం సరైంది కాదని, ఇది ట్రంప్ మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు.
Read Also: KCR phone tapping case : కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
అమెరికా ఎప్పుడూ ఇతర దేశాలు తన మాట వినాలని ఆశించడం తగదని, భారత్ వంటి పెద్ద దేశం స్వతంత్ర విదేశాంగ విధానంతో ముందుకు సాగుతుందని చెప్పారు. దశాబ్దాలుగా భారత్–రష్యా మిత్ర దేశాలుగా ఉన్నాయని, ఆ సంబంధాలను బలవంతంగా తెంచాలని ప్రయత్నించడం వ్యూహాత్మక తప్పిదమని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలపై బెదిరింపులతో వాణిజ్య ఒప్పందాలు సాధించడం దీర్ఘకాలంలో అమెరికాకే నష్టమని మాక్‌గ్రెగర్ హెచ్చరించారు. పరస్పర గౌరవం, సమాన భాగస్వామ్యం ద్వారానే అంతర్జాతీయ సంబంధాలు బలపడతాయని అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: