అమెరికా అధ్యక్షుడు అన్నిరంగాల్లో తనదైన ముద్రను వేసుకుంటున్నారు. ఒకవైపు అధిక సుంకాలను విధిస్తూ, ట్రేడ్ వార్ కు దిగారు. మరోవైపు వీసాలపై తన ఉక్కుపాదాన్ని మోపుతూ, కఠిన నిబంధనలతో విదేశీయుల గుండెల్లో వణుకుపుట్టిస్తున్నారు. అన్నిరకాల వీసాలపై పరిమితిని విధించడమే కాక విదేశీయు రాకను అడ్డుకుంటున్నారు. తాజాగా ట్రంప్(Trump) దృష్టి ఇప్పుడు ట్రంక్ డ్రైవర్లపై పడింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న, వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న 49 మందిని యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్టు చేశారు. వారిలో 30మంది భారతీయులు ఉన్నారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టార్ లోని ఇంటర్ ఏజెన్సీ కార్యకలాపాలలో భాగంగా ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద 49 మంది అక్రమ వలసదారులను బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్టు చేసినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Indian Jobs: కొత్త సంవత్సరంలో ఉద్యోగాలు సాధించడం సాధ్యమేనా?
ట్రక్కు డ్రైవర్లపై అమెరికా ఉక్కుపాదం
అమెరికాలో ఇటీవల తరచుగా జరుగుతున్న ట్రక్కు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ట్రక్కు డ్రైవర్లకు వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ల జారీని ఇప్పటికే ఆపివేసింది. ప్రస్తుతం వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ తో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 23-డిసెంబర్ 12 మధ్య బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు నిర్వహించిన ఆపరేషన్ లో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ లతో సెమీ ట్రక్కులు నడుపుతున్న 42 మంది వలసదారులను అరెస్టు చేశారు.
ఇందులో 30మంది భారతీయులు ఉన్నారు. అక్రమంగా అమెరికాకు(Trump) వచ్చిన రాజిందర్ కుమార్ (32) అనే భారతీయుడు రోడ్డు యాక్సిండ్ చేశాడు. దీంతో అతడిపై నేరపూరిత నిర్లక్ష్యం కూడిన హత్య, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ వంటి అభియోగాలు నమోదయ్యాయి. 2018లో అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన హర్జిందర్ సింగ్ కూడా ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించేందుకు కారకుడని అక్కడి అధికారులు తేల్చారు. దీంతో అతడిని అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ట్రంప్ ట్రక్కు డ్రైవర్లపై కఠిన చర్యలకు దిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: